యష్ వేదతో గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతాడు. ఖుషి సులోచన దగ్గరకి వచ్చి అమ్మకి ఏమైందని అడుగుతుంది. విన్నీ తనని దగ్గరకి తీసుకుని ప్రేమగా మాట్లాడి వేద అమ్మ హాస్పిటల్ లో ఉంది చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిందని చెప్తాడు. జ్వరం వచ్చింది అందుకని బాడీ వీక్ అయింది రెండు రోజులు హాస్పిటల్ లో ఉంటే తగ్గిపోతుందని అంటాడు. అమ్మ డాక్టర్ కదా వాళ్ళకి జ్వరం వస్తుందా నమ్మను అని ఖుషి అంటుంది. హాస్పిటల్ తీసుకెళ్లమని అడుగుతుంది. కానీ విన్నీ తనకి నచ్చజెప్తాడు. వేద అమ్మ దగ్గర ఉండకుండా ఇక్కడకి ఎందుకు వచ్చావ్అని ఖుషి సులోచనని అడుగుతుంది. ఆ ఫైల్ ఎక్కడ ఉందో తనకి తెలుసని వెళ్ళి తీసుకొచ్చి విన్నీ వాళ్ళకి ఇస్తుంది.
Also Read: కళ్ళు తెరిచిన వేద- తనని తాను నిందించుకున్న యష్, విన్నీ విలన్ గా మారతాడా?
ఖుషి చెప్పకపోయి ఉంటే ఆ ఫైల్ దొరికేదె కాదు అని సులోచన తనని మెచ్చుకుంటుంది. హాస్పిటల్ లో విన్నీ వాళ్ళకోసం యష్ ఎదురుచూస్తూ ఉంటాడు. వేద గురించి నాకు తెలియదు వాడికి తెలిసినంత మాత్రాన గొప్పోడు అయిపోతాడా అని తిట్టుకుంటాడు. విన్నీ రిపోర్ట్ తీసుకురాగానే వాటిని తీసుకుని యష్ డాక్టర్ ని కలవడానికి వెళతారు. తనకి బ్లడ్ కౌంట్ తక్కువగా ఉందని, స్టమక్ టీబీ మళ్ళీ తిరగబెట్టింది ఏమో చెక్ చేయాలని డాక్టర్ అనేసరికి యష్, విన్నీ షాక్ అవుతారు. అభి చిత్రకి ఫోన్ చేసి వేద గురించి అడిగి వంకరగా మాట్లాడతాడు. యష్ వేద దగ్గరకి వచ్చి కూర్చుని మాట్లాడతాడు. ‘వేద నిన్ను ఇంత దగ్గరగా చూస్తుంటే ఎంత మంచిదానివి నాకే అర్థం కానీ నన్ను నాకన్నా నువ్వే బాగా అర్థం చేసుకున్నావ్. నిన్ను ఒక్కసారి తాకొచ్చా. నీ స్పర్శ నన్ను సముదాయిస్తుంది. నీ ఊపిరి నన్ను ఊరడిస్తుందని’ బాధగా వెళ్ళిపోతాడు.
Also Read: మొదలైన పెళ్లి ఏర్పాట్లు - స్వప్నకి ఐలవ్యూ చెప్పిన రాహుల్, అక్కని నిలదీసిన కావ్య
రత్నం యష్ కి ధైర్యం చెప్తాడు. యష్ సులోచన వాళ్ళని ఇంటికి వెళ్లిపొమ్మని చెప్తాడు. వసంత్ చిత్ర మీద అలుగుతాడు. తనని కూల్ చెయ్యడం కోసం చిత్ర ట్రై చేస్తుంది. కావాలంటే జాబ్ మానేస్తానని అంటుంది జాబ్ విషయంలో డెసిషన్ నీదే అని వసంత్ అంటాడు. ఇద్దరూ కాసేపు వేద, యష్ గురించి మాట్లాడుకుంటారు. చిత్ర వసంత్ కి ప్రేమగా భోజనం తినిపిస్తుంటే యష్ అది చూస్తాడు. వేద తనకి ప్రేమగా తినిపించింది యష్ గుర్తు చేసుకుంటాడు. ‘నిన్ను ఇంత మిస్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు. నీ గురించి గుర్తు చేసుకుంటే నా గుండె బరువెక్కిపోతుంది అది నీ మీద నాకున్న ప్రేమ ఏమో. సెకండ్ ఛాన్స్ గురించి నువ్వు అడిగినప్పుడు ఐలవ్యూ అని అరవాలని అనిపించింది కానీ మన మధ్య ఉన్న అగ్రిమెంట్ మ్యారేజ్ గుర్తొచ్చి ఆగిపోయాను. నేను నిన్ను ప్రేమిస్తున్నా’ అని ఎలా చెప్పగలను అని ఎమోషనల్ అవుతాడు.