మలినేని గోపీచంద్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా సినిమా ‘వీరసింహారెడ్డి’.  థియేటర్లలో బ్లాక్ బస్టర్ సాధించిన ఈ మూవీ, ఫిబ్రవరి 23 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. డిజిటల్ వేదికపైనా ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వీరసింహారెడ్డి’ మూవీ తొలి షో నుంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. బాలయ్య కెరీర్ లో ‘అఖండ’ తర్వాత రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన రెండో సినిమాగా ఘనత సాధించింది. అమెరికాలో ఈ సినిమా అద్భుత కలెక్షన్లు సాధించింది. తాజాగా ఓటీటీలోనూ రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతోంది.  


1 నిమిషంలో 150K వ్యూస్ సాధించిన ‘వీరసింహారెడ్డి’


‘వీరసింహారెడ్డి’ సినిమా ఫిబ్రవరి 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్టీమింగ్ అవుతోంది. తెలుగ, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలయ్యిందో లేదో రికార్డు స్థాయిలో వ్యూస్ అందుకుంది. స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన 1 నిమిషంలోనే 150K పైగా వ్యూస్ పొందింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఈ స్థాయి వ్యూస్ అందుకోలేదు. ‘వీరసింహారెడ్డి’ తొలిసారి ఈ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఈ స్థాయిలోనూ వ్యూస్ కొనసాగితే డిజిటల్ వేదికపై ఈ చిత్రం మరిన్ని రికార్డులు సాధించే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.   


‘అఖండ’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బాలయ్య ఈ చిత్రంలో నటించారు. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. అందాల తార శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, లాల్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ మూవీకి థమన్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యుయెల్ రోల్ తో ఆకట్టుకున్నారు. ఆయన డైలాగులు, యాక్షన్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.  


తారకరత్న మరణంతో సినిమా షూటింగ్ వాయిదా


ఇక ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘ NBK108’ వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఓ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. తర్వాతి షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో మొదలుకానుంది. ఫిబ్రవరి 24 నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలు కావాల్సి ఉన్నా, నందమూరి తారకరత్న మరణం నందమూరి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమా షూటింగ్ ను వాయిదా వేశారు. తారకరత్నతో ఆయనకు అటాచ్ మెంట్ ఎక్కువగా ఉండటంతో ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు. మరోవైపు తారకరత్న కుటుంబ బాధ్యత తానే తీసుకుంటానని బాలయ్య ప్రకటించారు.


Read Also: ఆ సినిమా ఓ అద్భుతం, 90 సెకన్ల టీజర్‌తో అంచనా వేసేస్తారా? - ‘ఆదిపురుష్’ ఎడిటర్ ఆశిష్