Indian couple for stealing from Vietnam vendor: ఇతర దేశాలకు వెళ్లినప్పుడు చిల్లర పనులు చేయకూడదు. పర్యాటకులని గౌరవిస్తారు.. నమ్మకమిస్తే దాన్ని నిలబెట్టుకోవాలి. కానీ కొంత మంది కక్కుర్తి పడతారు. అలాంటిదే ఈ ఘటన.
భారత్ కు చెందిన ఓ జంట వియత్నంప పర్యటనకు వెళ్లింది. అక్కడ విండో షాపింగ్ కోసం రోడ్డు మీదకు వెళ్లారు. అక్కడ ఫుట్ పాత్ మీద చిన్న దుకాణం పెట్టుకున్న మహిళ అటెన్షన్ డైవర్షన్ చేసి కొన్ని వస్తువులు కొట్టేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ జంట ఎక్కడి వారు అన్నది తెలియలేదు కానీ.. కొంత మంది గుజరాత్ కు చెందిన జంట అని.. విదేశీ పర్యటనకు లక్షలు ఖర్చు చేస్తారు కానీ చిరు వ్యాపారుల వద్ద దొంగతనం చేస్తారని మండిపడ్డారు.
వియత్నాం లోని అనేక సోషల్ మీడియా ఖాతాలు ఈ CCTV ఫుటేజ్ ను పోస్టు చేసి ఇండియా జంటపై తీవ్రంగా మండి పడ్డారు. వారు చేసిన పనికి మొత్తం ఇండియాను ద్వేషించేవిధంగా కామెంట్లు చేశారు. కొనుగోలు చేయలేకపోతే, కొనుగోలు చేయకండి చిరు వ్యాపారులను ఎలా దోిపడీ చేస్తారని కొంత మంది ప్రశ్నించారు. ఇలాంటి పనులు చేయడం వల్ల ఇండియన్స్ టూరిస్టు వీసాలు కూడా పొందలేరని కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే కక్కుర్తితో ఎవరో ఒకరు చేసిన తప్పును మొత్తం ఇండియాకు ఆపాదించడం కరెక్ట్ కాదని నెటిజన్లు అంటున్నారు. వియత్నంకు పెద్ద ఎత్తున భారతీయులు వెళ్తూంటారు. వారిలో రకరకాల మనస్తత్వం ఉన్న వారు ఉంటారు. అందర్నీ ఒకే గాటన కట్టేలమని హితవు చెబుతున్నారు. కానీ ఇలాంటి వారిని క్షమించకూడదని అంటున్నారు.