Puri Jagannadh Vijay Sethupathi Movie Title Teaser Release Date: తమిళ స్టార్ విజయ్ సేతుపతి, టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి భారీ హైప్ క్రియేట్ అవుతూనే ఉంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీ టైటిల్, స్టోరీ ఏమై ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. 'ఉప్పెన' తర్వాత విజయ్ సేతుపతి డైరెక్ట్‌గా తెలుగులో ఈ మూవీ చేస్తుండడం ఆ అంచనాలను మరింత పెంచేసింది. తాజాగా ఈ మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Continues below advertisement

టైటిల్, టీజర్ ఎప్పుడంటే?

ఈ మూవీ టైటిల్ టీజర్‌ను ఈ నెల 28న ఆదివారం రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం 'పూరీ సేతుపతి' అనే వర్కింగ్ టైటిల్‌‌‌తో మూవీ రూపొందుతోంది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఓ డిఫరెంట్ స్టైల్, రోల్‌లో విజయ్ సేతుపతి ఈ మూవీలో చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక పూరీ జగన్నాథ్ సైతం ఫస్ట్ టైం ఇలాంటి కాన్సెప్ట్‌ను స్క్రీన్‌పై ప్రెజెంట్ చేస్తున్నారు. విజయ్ పాత్రలో 3 కోణాలుంటాయని... ఓ కోణంలో నెగిటివ్ షేడ్‌లో ఆయన కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. వీటన్నింటికీ టైటిల్, టీజర్ రిలీజ్ అయితే ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. టైటిల్ టీజర్‌ను తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Continues below advertisement

ఈ మూవీకి 'బెగ్గర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారనే గతంలో రూమర్లు వినిపించాయి. ఆ తర్వాత ఓ ప్రెస్ మీట్‌లో విజయ్ సేతుపతి అది నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ లాంగ్ షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ వేసినట్లు ఫిలింనగర్ వర్గాల టాక్.

Also Read: జ్యువెలరీ యాడ్ కాదు... 'అనగనగా ఒక రాజు' ప్రోమో - నవీన్ పోలిశెట్టి కామెడీ మూవీ వెరైటీగా...

ఈ మూవీలో విజయ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే టబు, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరీ కనెక్ట్స్, బేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై పూరీ జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

హిట్ కొట్టేనా?

'ఇస్మార్ట్ శంకర్' తర్వాత అంతటి స్థాయిలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఖాతాలో సక్సెస్ ప్రాజెక్ట్ పడలేదు. రీసెంట్‌గా ఇస్మార్ట్ శంకర్ 2 కూడా నిరాశపరిచింది. విజయ్ సేతుపతితో క్రేజీ ప్రాజెక్టుతో ఆయన హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పూరీ చెప్పిన స్క్రిప్ట్‌కు విజయ్ సేతుపతి ఫిదా అయినట్లు తెలుస్తోంది. అందుకే వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని గతంలో పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు విజయ్. ఈ మూవీతో బిగ్ సక్సెస్ సాధించాలని అంతా ఆకాంక్షిస్తున్నారు.