Cheetah Helicopter Crash:


ఇద్దరు మృతి..


అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన చీతా హెలికాప్టర్ ప్రమాదంలో ఇద్దరు పైలట్‌లు మృతి చెందినట్టు ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఉదయం ఈ హెలికాప్టర్ కుప్ప కూలగా అప్పటి నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఆర్మీ చీతా హెలికాప్టర్‌ మండాలా హిల్స్ వద్ద కుప్ప కూలింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.





గువాహటి డిఫెన్స్ పీఆర్‌వో,  కల్నల్ మహేంద్ర రావత్ ఈ ఘటనపై స్పందించారు. 


"అరుణాచల్ ప్రదేశ్‌లోని బొండిలాలో చీతా హెలికాప్టర్‌కు, ATCకి మధ్య కాంటాక్ట్ కట్ అయింది. ఉదయం 9.15 గంటలకే కాంటాక్ట్ కోల్పోయాం. మండాలా  హిల్స్ వద్ద క్రాష్ అయినట్టు సమాచారం అందింది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం" 


- కల్నల్ మహేంద్ర రావత్


గతంలోనూ..


గతేడాది అక్టోబర్‌లోనూ అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఇదే తరహా ప్రమాదం జరిగింది. ఓ సైనిక హెలికాప్టర్ క్రాష్ అయింది. అప్పర్ సియాంగ్ జిల్లాలోని ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగింగ్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ హెలికాప్టర్ కూలే ముందు పైలట్ "Mayday" కాల్ ఇచ్చినట్టు తేలింది. మేడే కాల్ అంటే...ఏదైనా ప్రమాదం జరిగే సూచన ఉన్నప్పుడు రేడియో ద్వారా పైలట్ సమాచారం అందించటం. ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ ఉన్నా..వెంటనే ఆ రేడియో ద్వారా పైలట్ అలర్ట్ చేస్తాడు. ఈ ప్రమాదం జరిగే ముందు Air Traffic Control (ATC)కి కాల్ చేశాడు పైలట్. టెక్నికల్ లేదా మెకానికల్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చని చెప్పాడు. అంతలోనే హెలికాప్టర్ కుప్ప కూలింది. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. నిజానికి వాతావరణ పరిస్థితులు హెలికాప్టర్ఎగరటానికి అనకూలంగానే ఉంది. పైగా...ఆ పైలట్‌కు ఎంతో అనుభవం కూడా ఉంది. అయినా...ఈ ప్రమాదం ఎందుకు జరిగిందన్న అంశంపై విచారణ చేపట్టారు. 


Also Read: జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించండి, ఈసీని డిమాండ్ చేసిన పార్టీలు