Zomato CEO Deepinder Goyal : అనుభవమైతేనే తత్వం బోధపడుతుంది - డెలివరీ ఏజెంట్‌గా మారి కష్టాలు తెలుసుకున్న జొమాటో సీఈవో !

Zomato: ఫుడ్‌ను డెలివరీ చేసే ఏజెంట్లు నిత్యం ఎదుర్కొనే మేజర్ ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని ఓ సీఈవో, ఆయన భార్య ఫేస్ చేయడంతో దీనిపై డిబేట్ నడుస్తోంది.

Continues below advertisement

Viral News: Zomato సీఈవో దీపిందర్ గోయల్, భార్య గ్రీసియా మునోజ్‌ ఫుడ్‌ డెలివరీ వ్యక్తులుగా మారిపోయారు. ఫుడ్‌ డెలివరీ చేస్తున్న వారి సమస్యలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బంది తెలుసుకునేందుకు వారంలో ఏదో రోజు ఇలా చేస్తున్నారీ జంట. రెండు రోజుల క్రితం కూడా గుర్‌గ్రామ్‌లోని ఓ ప్రాంతంలో ఇలాంటి ప్రయత్నం చేశారు. ఆదివారం కూడా మరోసారి ఫుడ్ డెలివరీ చేశారు.   

Continues below advertisement

ఫుడ్ డెలివరీ బాయ్ డ్రెస్ వేసుకొని ఫుడ్‌ను అందివ్వడానికి వెళ్తున్న దీపిందర్ గోయల్ అనూహ్యమైన అనుభవం ఎదరైంది. గురుగ్రామ్‌లోని యాంబియన్స్ మాల్‌లోకి వెళ్తుండగా సిబ్బంది అడ్డుకున్నారు. ఎలివేటర్ ఎక్కేందుకు వాళ్లు చేసిన ప్రయత్నాన్ని అక్కడే ఉన్న మాల్ సెక్యూరిటీ అడ్డుకున్నారు. మెట్ల మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. ఈ విషయాన్ని గోయల్‌ స్వయంగా తన అనుభవాన్ని పంచుకున్నారు.  

ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని పంచుకున్న గోయల్‌... పరిస్థితి రావాల్సిన మార్పులు ప్రస్తావించారు. జొమాటో వంటి కంపెనీల సేవలను  మాల్స్ సహకరించాల్సిన అవసరం ఉందన్నారాయన. "ఫుడ్‌ డెలివరీ భాగస్వామైన వారందరి పరిస్థితి మెరుగుపరిచేందుకు మేం కృషి  చేస్తం. మాల్స్‌తో మరింత సన్నిహితంగా పని చేయాలి" అని గోయల్ అన్నారు, మాల్స్ మరింత మానవీయ విధానాన్ని అవలంబించాలని అన్నారు.

పారిశ్రామికవేత్త రతన్‌ టాటా తీవ్ర అస్వస్థతకు గురయ్యారా? ఐసీయూలో చికిత్స పొందుతున్నారా?

తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ హల్దీరామ్ నుంచి ఆర్డర్‌ తీసుకునేందుకు వెళ్తున్న టైంలో మాల్‌ సిబ్బంది అడ్డుకున్నారని తెలిపారు. వెళ్లేందుకు వేర్వేరు గేట్‌లు ఉపయోగించాలని మెట్ల ద్వారా చేరుకోవాలని సూచించిన విషయాన్ను వెల్లడించారు. "ఫుడ్‌ డెలివరీ చేసే వారి కోసం ప్రత్యేకమైన ఎలివేటర్లు అందుబాటులో ఉన్నాయో లేదో చూశాను. మెయిన్ గేట్‌ నుంచి వెళ్లి చూస్తే అలాంటివేమీ కనిపించలేదు. " అని చెప్పారు.                       

డెలివరీ ఏజెంట్లు తరచుగా తమ ఆర్డర్‌ల కోసం ఎలివేటర్ల వద్ద వేచి చూడటం, అక్కడ అనుమతి లేకపోతే ఎన్ని అంతస్తులైనా మెట్లు ఎక్కి ఎలా వెళ్తారో తెలిపేందుకు తాను ప్రయత్నం చేసినట్టు వివరించారు. గోయల్ తన తోటి డెలివరీ భాగస్వాములతో నేలపై కూర్చున్నట్లు ఆ వీడియోలో ఉంది. డెలివరీ పార్టనర్‌ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటూ ఇలా సేదతీరినట్టు పోస్టు చేశారు. 

దీపిందర్ గోయల్‌కు ఎదురైన అనుభవం చాలా మంది డెలివరీ ఏజెంట్లు నిత్యం ఫేస్ చేస్తున్న సమస్య అంటున్నారు నెటిజన్లు.          

ఇది కూడా చదవండి: సెలవుల్లో టూర్ వెళుతున్నారా, ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా, అది ఎందుకు ముఖ్యమో తెలుసా?  

Continues below advertisement