దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉండగా, జికా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కేరళ రాష్ట్రాన్ని వణికించిన జికా వైరస్‌ను తాజాగా ఉత్తరప్రదేశ్‌లో గుర్తించారు. యూపీలోని కాన్పూర్‌లో తొలి జికా వైరస్ కేసు ఆదివారం నాడు నమోదైంది. ఆ బాధితుడిని నేరుగా కలిసిన వారి కదలికలపై మెడికల్ సిబ్బంది ఆరా తీస్తున్నారు.


ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికి జికా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని కాన్పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేపాల్ సింగ్ వెల్లడించారు. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఐఏఎఫ్ అధికారి ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్ లో చేరారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించి పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారుని పీటీఐ రిపోర్ట్ చేసింది. ఐఏఎఫ్ అధికారి టెస్ట్ రిజల్ట్స్ రాగా, జికా పాజిటివ్ అని తేలింది. కాన్పూర్ అధికారుల చేతికి రిపోర్టులు అందాయని చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు. 


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


వారంట్‌లో ఉన్న అధికారితో నేరుగా కాంటాక్ట్ అయిన 22 మంది శాంపిల్స్ తీసుకుని పుణేలోని సంస్థకు పరీక్షల నిమిత్తం పంపారు. యూపీలో తొలి జికా కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పలు టీమ్ లను ఏర్పాటు చేసి రాష్ట్రంలో జికా వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అధిక జనాభా ఉండే రాష్ట్రం కనుక ముందుగానే అప్రమత్తమై జికాకు అడ్డకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌ను సైతం అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.


Also Read: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు


కాగా, కొన్ని నెలల కిందట కేరళలో ఓ గర్భిణీకి దేశంలో తొలిసారిగా జికా సోకింది. జులై 8న 24 ఏళ్ల గర్భిణీకి జ్వరం రాగా టెస్టులు చేయడంతో జికా పాజిటివ్ గా తేలింది. ఆపై ఓవరాల్ గా 60కు పైగా జికా కేసులు కేరళలో నమోదయ్యాయి. ఆగస్టులో మహారాష్ట్రలో పుణేకు చెందిన మహిళ జికా వైరస్ బారిన పడ్డారు. కరోనా ముప్పు ఇంకా పొంచి ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాతో పాటు జికా కట్టడికి పోకస్ చేస్తున్నాయి.


Also read: మన మసాలా దినుసులతో గుండె జబ్బులు దూరం.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి