Zero Shadow Day 2023: 



బెంగళూరులో జీరో షాడో డే 


బెంగళూరు వాసులు జీరో షాడో డేని (Zero Shadow Day 2023) ఎక్స్‌పీరియెన్స్ చేశారు. గతంలోనూ ఇక్కడ జీరో షాడో డే నమోదైంది. సూర్యుడు సరిగ్గా నడి నెత్తి మీదకు రావడం వల్ల నేలపైన నీడ పడదు. దీన్నే జీరో షాడో డే అంటారు. అంటే...నీడ మాయం అయిపోతుందన్నమాట. అది కాసేపే. మళ్లీ సూర్యుడి కక్ష్య మారగానే వెంటనే సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 25న బెంగళూరులో జీరో షాడో డే జరిగింది. ఇప్పుడు మరోసారి అదే అనుభవం ఎదురైంది. బెంగళూరుకి ఉన్న భౌగోళిక పరిస్థితుల కారణంగా ఏడాదికి రెండు సార్లు ఈ జీరో షాడో డేని ఎక్స్‌పీరియెన్స్ చేయడానికి అవకాశం ఉంటోంది. ఒకే రోజు వేరు వేరు సమయాల్లో ఇది నమోదవుతుంది. చెన్నై, మంగళూరులోనూ ఇదే జరిగింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న బెంగళూరులో మరోసారి జీరో షాడో డే నమోదవనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. 


జీరో షాడో డే అంటే..? 


Astronomical Society of India (ASI) చెబుతున్న వివరాల ప్రకారం...జీరో షాడో టైమ్‌లో ఏ వస్తువుపైన కానీ, మనిషిపైన కానీ సూర్యుడి కాంతి పడినా నీడ కనిపించదు. దీన్నే టెక్నికల్ పరిభాషలో జెనిత్ పొజిషన్ ( Zenith Position) అంటారు. ఈ కారణంగానే జీరో షాడో డే వస్తుంది. ఏటా రెండుసార్లు ఈ ఫినామినన్‌ జరుగుతుందని వెల్లడించింది. కర్కాటక, మకరరేఖల మధ్యనున్న ప్రాంతాల్లోనే ఇది కనిపిస్తుంది. జీరో షాడో టైమ్‌లో సూర్యుడి అక్షాంశం, మనిషి అక్షాంశం సమాంతరంగా ఉంటాయి. అంటే సూర్యూడి కాంతి మనిషి పరిధిని దాటి పోలేదు. అందుకే కింద నీడ పడదు.


సూర్యుడి చుట్టూ భూమి తిరిగే క్రమంలో రొటేషన్ యాక్సిస్‌ 23.5 డిగ్రీల మేర వంగిపోతుంది. ఈ క్రమంలోనే మన వాతావరణంలో మార్పు వస్తూ ఉంటుంది. అంటే...కాంతి తీవ్రతలో మార్పు వస్తుంది. సూర్యుడు నట్ట నడి మధ్యకు వచ్చేశాడు..అందుకే ఇంతగా ఎండ మండుతోంది అనుకుంటాం. కానీ...సూర్యుడు కచ్చితంగా నడి నెత్తి మీదకు కేవలం రెండేసార్లు వస్తాడు. ఉత్తరాయణంలో ఓసారి, దక్షిణాయనంలో మరోసారి ఇవి జరుగుతాయి. అప్పుడు మాత్రమే కరెక్ట్‌గా మధ్యలోకి వచ్చేస్తాడు సూర్యుడు. దీన్నే జెనిత్ పాయింట్‌ అని పిలుస్తారు. ఇక టెక్నికల్‌గా చెప్పాలంటే సూర్యుడు మకరరాశి, కర్కాటక రాశి మధ్య +23.5,-23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్నప్పుడు ఈ వింత జరుగుతుంది. కరెక్ట్‌గా మధ్యలోకి వచ్చేయడం వల్ల సూర్య కిరణాలు స్ట్రెయిట్‌గా భూమిని తాకుతాయి. అందుకే మన నీడ కనిపించదు. భువనేశ్వర్, ముంబయి, హైదరాబాద్, బెంగళూరులో ఈ జీరో షాడో డే తరచూ కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా రెప్ప పాటులోనే జరిగినప్పటికీ..దాని ప్రభావం మాత్రం దాదాపు నిముషం పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2021లో ఒడిశా, భువనేశ్వర్‌లో ఇలానే జరిగింది. 


Also Read: ఇకపై వేసవిలో నో టెన్షన్, చల్లని కబురు చెప్పిన ఢిల్లీ ప్రభుత్వం - యాక్షన్ ప్లాన్ రెడీ