National Girl Child Day 2024: భారతీయ సంస్కృతిలో ఆడపిల్లలకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఆడపిల్ల పిల్ల ఉన్న ఇళ్లు ఆనందంతో కళకళలాడుతూ ఉంటుంది. కాళ్లకు మువ్వల పట్టీలు వేసుకొని తిరుగుతుంటే కన్న వాళ్లు మురిసిపోతుంటారు. కాల క్రమంలో చాలా అసమానతలు పెరిగిపోతూ వచ్చాయి.


National Girl Child Day 2024: జాతీయ బాలికా దినోత్సవ చరిత్ర ఏంటీ?


ఆమెను ఇంటికి పరిమితం చేశారు... ఆడపిల్లను కనేందుకే భయపడ్డారు. దీంతో మగవారితో పోల్చుకుంటే ఆడపిల్లల నిష్పత్తి దారుణంగా పడిపోయింది. ఈ పరిస్థితిలో మార్పు రాకుంటే ప్రమాదమని గ్రహించిన ప్రభుత్వాలు ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అసమానతలపై అవగాహన కల్పించి సమానహక్కులు కల్పించేందుకు పూనుకున్నారు. ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 
ఈ జాతీయ బాలికా దినోత్సవాన్ని 2008 నుంచి జరుపుకుంటూ వస్తున్నాం. మొదట దీన్ని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. అప్పటి నుంచి ఇదో సంప్రదాయంగా వస్తోంది. ఏడాదికో థీమ్‌లో జాతీయ బాలికా దినోత్సవాలు జరుపుకుంటూ వస్తున్నారు. 


National Girl Child Day 2024: ఈ ఏడాది థీమ్‌ ఏంటీ?


ఈ ఏడాది మాత్రం ప్రభుత్వం ఎలాంటి థీమ్ ప్రకటించలేదు. 2023,23లో కూడా ఎలాంటి థీమ్‌ను ప్రభుత్వం ప్రకటించలేదు. అంతకముందు 2021లో డిజిటల్‌ జనరేషన్‌, అవర్‌ జనరేషన్ అనేది థీమ్, 2020లో మై వాయిస్‌, అవర్‌ కామన్‌ ఫ్యూచర్‌, 2019లో ఎంపవరింగ్‌ గర్ల్స్‌ ఫర్‌ బ్రైట్‌ టుమారో అనేది థీమ్‌గా ప్రకటించారు. 


ఆ రోజు విద్య, ఆరోగ్యం, పోషకాహారంలోనే కాకుండా సమాన హక్కులపై కూడా అవగాహన కల్పించే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి. అదే టైంలో బాల్య వివాహాలు, వివక్ష, బాలికలపై హింస వంటి సమస్యలపై కూడా పోరాటం చేయాలని ఉత్తేజపరుస్తున్నాయి. ఈ వేడుక ద్వారా బాలిక ప్రాధాన్యత గుర్తిస్తూ వారికి సమాజం గౌరవ మర్యాదలు ఇచ్చేలా టార్గెట్‌గా పెట్టుకుంది. 


బాలికలకు ఉన్న హక్కులు, వారి కోసం చేపడుతున్న కార్యక్రమాలను గుర్తు చేస్తూ దేశవ్యాప్తంగా ర్యాలీలు, అవగాహన సదస్సులు, ప్రచారా కార్యక్రమాలు చేపడుతున్నాుర. అమ్మాయిలను గౌరవప్రదంగా చూసుకోవడం, వారికి బాలురుతో సమాన అవకాశాలు వచ్చేలా చేయడం, వారితోనే ఉన్నత సమాజం ఏర్పాడుతుందనే ఆలోచన వ్యాప్తి చేయడం దీని లక్ష్యం. 


National Girl Child Day 2024: జాతీయ బాలికా దినోత్సవం లక్ష్యాలు ఏంటీ
మూడు ప్రధాన లక్ష్యాలతో జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం. 


లింగ మసమానత్వాన్ని ప్రోత్సహించడం: బాలబాలికలు సమానమని చెప్పడం జాతీయ బాలికా దినోత్సవం ప్రధాన లక్ష్యం. అలాంటి వివక్షను పూర్తిగా రూపుమాపి అందరికీ సమానంగా ఎదిగే అవకాశాలు ఇవ్వడం. 


బాలికలకు సాధికారత: బాలికలకు చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ వారికి ఎదురైన అసమానత కారణంగా అనుకున్న గమ్యాలను చేరుకోలేకపోతున్నారు. అందుకే వారికి ఉన్న శక్తి యుక్తులను గ్రహించి అవకాశాలు అందిపుచ్చుకునేలా సిద్ధం చేయడం. 
బాలికల హక్కులకు పరిరక్షించడం: బాలికలకు ప్రాథమిక హక్కులైన పౌష్టికాహారం, విద్య లాంటివి సరిగా అందేలా చూడటం. బాల్యవివాహాలు, హింస ఎదుర్కోవడానికి అవసరైన శక్తిని ఇవ్వడం. 


లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం: జాతీయ బాలికా దినోత్సవం లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. విద్య, ఆరోగ్యం, సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చకు వచ్చేలా చేసి వాటి పరిష్కారానికి మార్గాలను నిర్దేశిస్తుంది. బాధిత బాలికలకు సమాజం నుంచి మద్దతు లభిస్తుంది. వారికి సమాన అవకాశాలు లభించేలా చేస్తుంది. సామాజిక రుగ్మతలపై పోరాడేలా చేస్తుంది.