India vs Pakistan Army: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో భారతదేశం,  భారత సైన్యంపై నోరుపారేసుకున్నారు.  జనరల్ మునీర్ భారతదేశం బలాన్ని ప్రస్తావిస్తూ, '13 లక్షల మంది భారత సైన్యం తమ బలంతో పాకిస్తాన్ ఆర్మీని భయపెట్టలేకపోయింది అలాంటిది పిడికెడు ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీని ఓడించగలరా?' అని అన్నారు. ఈ ప్రకటన తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక శక్తి పోలిక మళ్ళీ చర్చనీయాంశంగా మారింది.

ఎవరి బలం ఎంత?గ్లోబల్ ఫైర్‌పవర్ (GFP) 2025 నివేదిక ప్రకారం, భారతదేశం ప్రపంచంలో నాలుగో అత్యంత బలమైన సైనికశక్తి ఉన్న దేశం. అదే సమయంలో పాకిస్తాన్ గత సంవత్సరం 2024లో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇప్పుడు  ఇది 12వ స్థానానికి పడిపోయింది. గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ (GFP) ప్రతి సంవత్సరం దేశాల సాంప్రదాయ యుద్ధ సామర్థ్యాలను అంచనా వేస్తుంది. ఈ సూచికలో జనాభా, రక్షణ బడ్జెట్, సైనిక వనరులు, కొనుగోలు శక్తి,  వ్యూహాత్మక స్థితి వంటి 60 కంటే ఎక్కువ అంశాలను పరిగణనలోకి తీసుకొని సైనిక శక్తిని గణిస్తుంది. 

భారతదేశం మొత్తం జనాభా దాదాపు 1.4 బిలియన్లు, ఇది ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. అయితే పాకిస్తాన్ జనాభా దాదాపు 240 మిలియన్లు, ఇది ఐదో స్థానంలో ఉంది. భారతదేశం 5 మిలియన్లకుపైగా సైనిక శక్తిని కలిగి ఉంది. పాకిస్తాన్ దాదాపు 1 మిలియన్ మందినే కలిగి ఉంది. భారత్‌ యాక్టివ్ మిలిటరీ స్ట్రెంత్ దాదాపు 1.4 మిలియన్లు. ఇది పాకిస్తాన్ 650,000 యాక్టివ్ సైనికుల కంటే చాలా ఎక్కువ. అంతేకాకుండా భారతదేశం రిజర్వ్ ఆర్మీ , పారా మిలిటరీ దళాల బలం అధికం.

రక్షణ బడ్జెట్ పోలిక2023-24 కేంద్ర బడ్జెట్‌లో భారతదేశం తన రక్షణ ఏర్పాట్ల కోసం 5.94 ట్రిలియన్ (సుమారు $73.8 బిలియన్) కేటాయించింది. మరోవైపు పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ కేవలం $6.34 బిలియన్ మాత్రమే. అంటే భారత్‌ సైనిక బడ్జెట్ పాకిస్తాన్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉందని స్పష్టమవుతుంది. దీని ద్వారా భారతదేశం అధునాతన ఆయుధాలు, సైనిక సాంకేతికత, భద్రతా మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడి పెడుతుంది.

నింగిలో కూడా భారత్‌ ఆధిపత్యం

భారతదేశం మొత్తం 2,296 విమానాలను కలిగి ఉంది. ఇది ప్రపంచ స్థాయిలో వైమానిక శక్తిలో నాలుగో స్థానంలో ఉంది.అయితే పాకిస్తాన్ 1,434 విమానాలను కలిగి ఉంది. భారత వైమానిక దళంలో 606 ఫైటర్ విమానాలు, 31 స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఇందులో SU-30MKI, రాఫెల్, తేజస్ వంటి ఆధునిక విమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ కేవలం 387 ఫైటర్ విమానాలను కలిగి ఉంది. వీటిలో ఎక్కువ భాగం పాత అమెరికన్, చైనీస్ సాంకేతికతతో ఉన్నాయి.

భూ సైన్యం ఆర్టిలరీభారతదేశం 4,614 ట్యాంకులను కలిగి ఉంది. పాకిస్తాన్ 3,742 ట్యాంకులను కలిగి ఉంది. బుల్లెట్‌ప్రూఫ్ వాహనాల విషయానికి వస్తే భారతదేశం దాదాపు 1.51 లక్షల బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు కలిగి ఉంది. ఇది పాకిస్తాన్ దాదాపు 50,000 వాహనాల కంటే మూడు రెట్లు ఎక్కువ. భారతదేశం కంటే పాకిస్తాన్ ఎక్కువ ఆటోమేటిక్ తుపాకులను కలిగి ఉంది. కానీ భారతదేశం మరింత ఆధునిక ట్యాంకులు, మెరుగైన సైనిక వాహనాలను కలిగి ఉంది. 

నౌకాదళం: బ్లూ వాటర్ vs గ్రీన్ వాటర్భారతదేశం మొత్తం 294 నౌకాదళ ప్లాట్‌ఫామ్‌లను కలిగి ఉంది. పాకిస్తాన్ 114 కలిగి ఉంది. భారతదేశం రెండు విమాన నౌకలను (INS విక్రాంత్, INS విక్రమాదిత్య) కలిగి ఉంది. పాకిస్తాన్ వద్ద ఒక్క విమాన నౌక కూడ లేదు. ఈ కారణంగా భారత నౌకాదళాన్ని బ్లూ-వాటర్ నౌకాదళం వర్గంలో ఉంచుతారు. అయితే పాకిస్తాన్ నౌకాదళాన్ని గ్రీన్-వాటర్ నౌకాదళం అంటారు. ఇలా ఏ విభాగంలో చూసుకున్నా సరే పాకిస్థాన్ కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉంది.