Indian PM: ప్రతి దేశం ఇతర దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండడానికి ప్రయత్నిస్తుంది. తద్వారా అవసరమైన సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే పరస్పర సంబంధాలను మెరుగుపరచుకోవడానికి దేశాధినేతలు ఇతర దేశాలను సందర్శిస్తుంటారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా తరచుగా విదేశీ పర్యటనలు చేస్తుంటారు. అలా ప్రధానమంత్రి విదేశాలకు వెళ్లినప్పుడు ఆయనకు ఎలాంటి స్వాగతం లభిస్తుందో అందరం చూస్తూనే ఉంటాం. అయితే భారత ప్రధాని వేరే దేశాలకు వెళ్లినప్పుడు ఆయన ఎక్కడ ఉంటారు? ఎలాంటి బస ఏర్పాటు చేస్తారు? ఆయనకు లభించే సెక్యురిటీ ఎలా ఉంటుంది? అనే విషయాలపై ఓ లుక్కేయండి.
విదేశీ పర్యటనలో ప్రధాని ఎక్కడ ఉంటారు?
విదేశీ సందర్శనల సమయంలో ఒక దేశ ప్రధానమంత్రి సాధారణంగా ప్రభుత్వ అతిథి గృహాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని హోటళ్లు, ఆతిథ్య దేశ అధినేత ఇల్లు వంటి అధికారిక నివాసాల్లో ఉంటారు. లేకపోతే ఆ దేశంలోని ఖరీదైన హోటళ్లలో బస చేస్తారు. అక్కడ వారికి వసతి ఏర్పాట్లతోపాటు, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. సెక్యురిటీ బాగా ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేస్తారు.
ఉదాహరణకు ఐక్యరాజ్యసమితి సమావేశాల కోసం భారత ప్రధాని విదేశాలకు వెళ్లినప్పుడు తరచుగా న్యూయార్క్ ప్యాలెస్ హోటల్‌లో బస చేసేవారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా తరచూ అక్కడే బస చేస్తుంటారు. కొన్నాళ్ల కిందట ఈ స్థలంలో మార్పు గురించి చర్చ జరిగింది.
భద్రతపై ప్రత్యేక దృష్టి
అతిథిగా వచ్చిన ప్రధా నమంత్రికి భద్రత, సౌకర్యాన్నిఆతిథ్య దేశం అందిస్తుంది. అయితే కొన్నిసార్లు విదేశీ పర్యటనలు చేసే అధినేతలు తమ భద్రతా సిబ్బందిని వెంట తీసుకెళ్తారు. కొన్నేళ్ల కిందట ప్రధాని మోదీ ఇజ్రాయెల్ వెళ్లినప్పుడు జెరూసలేంలోని కింగ్ డేవిడ్ హోటల్‌లో బస చేశారు. ఈ హోటల్ ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటి. కొన్ని నివేదికల ప్రకారం, ప్రధాని మోదీ ఈ హోటల్‌లో బస చేసినప్పుడు, ఆయన ఒక రాత్రి ఖర్చు దాదాపు రూ. 1 కోటి. దీంతో పాటు ఆ హోటల్ లో అప్పటికే ఉన్న అతిథులను ఖాళీ చేయించారు.
ప్రధాని మోదీ స్పెషల్ జాకెట్
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్‌కు వచ్చిన ప్రధాని మోదీ... ఓ స్పెషల్ జాకెట్‌తో కనిపించారు. ప్లాస్టిక్ బాటిల్స్‌ను రీసైక్లింగ్‌తో తయారు చేసిన మెటీరియల్‌తో ఆ జాకెట్‌ను తయారు చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలన్న నిర్ణయానికి కట్టుబడి...వాటితో తయారు చేసిన జాకెట్‌ను ధరించారు ప్రధాని నరేంద్ర మోదీ. "Unbottled" కార్యక్రమంలో భాగంగా.. ఇండియన్ ఆయిల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్‌లు డెలివరీ చేసే బాయ్స్‌కి రీసైకిల్డ్ పాలిస్టర్, కాటన్‌తో తయారు చేసిన యూనిఫామ్స్‌ను పంపిణీ చేస్తోంది. ఫిబ్రవరి 6వ తేదీన బెంగళూరులో India Energy Week 2023 కార్యక్రమం జరగ్గా.. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఆ సమయంలోనే ఆ యూనిఫామ్స్‌ను ఆవిష్కరించారు.