PM Modi Sadri Jacket:
ప్లాస్టిక్ రీసైక్లింగ్‌తో..
ప్రధాని నరేంద్ర మోదీ జాకెట్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. "మోదీ జాకెట్" అనే పిలుచుకునేంతలా అదో ట్రెండ్ అయింది. మోదీ డ్రెసింగ్ స్టైల్‌లో అందరినీ అట్రాక్ట్ చేసింది ఈ జాకెట్టే. ఇప్పుడు మరోసారి ఆయన డ్రెసింగ్‌పై చర్చ జరుగుతోంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్‌కు వచ్చిన ప్రధాని మోదీ...ఓ స్పెషల్ జాకెట్‌తో కనిపించారు. ప్లాస్టిక్ బాటిల్స్‌ను రీసైక్లింగ్‌తో తయారు చేసిన మెటీరియల్‌తో ఆ జాకెట్‌ను తయారు చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలన్న నిర్ణయానికి కట్టుబడి...వాటితో తయారు చేసిన జాకెట్‌ను ధరించారు ప్రధాని నరేంద్ర మోదీ. "Unbottled" కార్యక్రమంలో భాగంగా..ఇండియన్ ఆయిల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్‌లు డెలివరీ చేసే బాయ్స్‌కి రీసైకిల్డ్ పాలిస్టర్, కాటన్‌తో తయారు చేసిన యూనిఫామ్స్‌ను పంపిణీ చేస్తోంది. ఫిబ్రవరి 6వ తేదీన బెంగళూరులో India Energy Week 2023 కార్యక్రమం జరగ్గా..ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఆ సమయంలోనే ఆ యూనిఫామ్స్‌ను ఆవిష్కరించారు.
ఇలా తయారు చేస్తారు..
ఒకసారి వాడి పారేసిన బాటిల్స్‌ను ఫ్యాబ్రిక్‌గా మార్చేందుకు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ముందుగా వాటిని కడుగుతారు. ఆ తరవాత ఆరబెట్టి క్రష్ చేస్తారు. వాటిని చిన్న చిప్స్‌లా మార్చేస్తారు. ఈ చిప్స్‌ను హీట్ చేస్తారు. ఆ చిప్స్‌ను పాలిస్టర్‌ను తయారు చేసే పరికరంలోకి పంపించి ఫ్యాబ్రిక్‌ను ఉత్పత్తి చేస్తారు. ఇలా తయారు చేసిన జాకెట్‌నే ప్రధాని మోదీ ధరించారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కట్టుబడి ఉండాలన్న సందేశమిచ్చారు.
ప్లాస్టిక్ నుంచి వజ్రాలు..
అత్యంత చౌకగా లభించే ప్లాస్టిక్ నుంచి వ్రజాలు తయారు చేయవచ్చని నిరూపించారు ఐరోపాకు చెందిన పరిశోధకులు. లేజర్ ల ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని వెల్లడించారు. అత్యంత శక్తి కలిగిన లేజర్ కిరణాలు ప్లాస్టిక్ షీట్ల మీద పడినప్పుడు నానో డైమండ్స్ తయారు అవుతాయని వెల్లడించారు. వీటి ద్వారా అత్యంత చౌక ధరలకే నగలను తయారు చేసి అమ్మే అవకాశం ఉంటుందన్నారు. జర్మన్ భౌతిక శాస్త్రవేత్త డొమినిక్ క్రాస్ ప్లాస్టిక్ నుంచి తయారయ్యే నానో వజ్రాల తయారీ గురించి పలు విషయాలు వెల్లడించారు. " అల్ట్రాస్మాల్ క్వాంటం సెన్సార్‌లు, ఉష్ణోగ్రత, అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి నానోడైమండ్స్ తయారు చేసే అవకాశం ఉంటుందన్నారు. వీటి ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు జరిగే అవకాశం ఉందంటున్నారు.
Also Read: Tandoor Ban: తందూరీ రోటీలను బ్యాన్ చేసిన ప్రభుత్వం,రూల్ బ్రేక్ చేస్తే భారీ జరిమానా