Tandoor Roti Ban:


మధ్యప్రదేశ్‌లో నిషేధం..


తందూరి రోటీని లొట్టలేసుకుంటూ తినే వారికి ఓ బ్యాడ్ న్యూస్. ఇకపై తందూరి రోటీ దొరకదు. ఎందుకంటే ప్రభుత్వమే బ్యాన్ చేసేసింది. 
మధ్యప్రదేశ్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇది. భోపాల్, ఇండోర్, జబల్‌పూర్, గ్వాలియర్‌లో అన్ని రెస్టారెంట్‌లలోనూ తందూరి రోటీని తయారు చేయడానికి, అమ్మడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. తందూరీ తయారీ కారణంగా వాయు కాలుష్యం పెరుగుతోందని వివరించింది. ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించిన వారికి రూ.5 లక్షల జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌లోని ప్రధాన నగరాలన్నింటి లోనూ ఈ మధ్య కాలంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీన్ని కట్టడి చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫుడ్ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే ఆదేశాలూ జారీ చేసింది. హోటళ్లు, ధాబా యాజమాన్యాలకు నోటీసులు పంపింది. ఈ నిర్ణయంతో ఆయా హోటళ్లపై తీవ్ర ప్రభావం పడనుంది. తందూరీ రోటీ తయారు చేయడానికి ప్రత్యేక పరికరాలు వాడతారు. చెక్కతో తయారు చేసిన డ్రమ్‌లో బొగ్గుని మండిస్తూ వీటిని తయారు చేస్తారు. బొగ్గు అధికంగా వినియోగించడం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో పొగ కమ్ముకుంటోంది. అందుకే...వీటిపై నిషేధం విధించింది ప్రభుత్వం. ఎలక్ట్రిక్ ఓవెన్‌ లేదా LPG గ్యాస్‌లను మాత్రమే వినియోగించాలని అధికారులు ఆదేశించారు. మధ్యప్రదేశ్‌ ప్రజలకు తందూరీ రోటీయే స్పెషల్ డిష్. చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్రభుత్వం బ్యాన్ చేయడం వల్ల ఉసూరుమంటున్నారు. 


ప్రమాదకరం..


గ్రిల్ పై కాల్చి తయారు చేసే.. తందూరి చికెన్ అంటే అందరికీ నోరూరుపోతుంది. తందూరి రుచి మరి ఇంకదేనికి రాదనే చెప్పాలి. అయితే ఇలా నిప్పుల మీద కాల్చి చేసే తందూరి చికెన్ లేదా మాంసం తినడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం వెల్లడిస్తుంది. తందూరి చికెన్ ని బార్బేక్యూ అనే మెథడ్ లో వండుతారు. కూరగాయల నూనెని వేడి చేసినప్పుడు అందులో వచ్చే ప్రమాదకరమైన సమ్మేళనాలని బార్బేక్యూ పరిమితం చేస్తుంది. అయితే నేరుగా మంటపై చేసే ఆహార పదార్థాలు, ప్రత్యేకించి మాంసాహారం వల్ల క్యాన్సర్ కి కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మాంసాన్ని నేరుగా మంట మీద పెట్టి కాల్చడం వల్ల దాని పై పొరపై క్యాన్సర్ సమ్మేళనాలు ఏర్పడే ప్రమాదం ఉంది. కండలు పెరిగేందుకు దోహద పడే ఆర్గానిక్ యాసిడ్ అధిక మంట మీద వేడి చేసినప్పుడు క్యాన్సర్ కి కారణమయ్యే హెటెరోసైక్లిక్ అమైన్‌లుగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే అవి కాలుతున్నప్పుడు వాటి కొవ్వు నిప్పు మీద పడుతుంది. ఇది పాలీ సైక్లిక్ ఆరోమెటిక్ హైడ్రోకార్బన్ లకి దారితీస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. కాల్చిన మాంసాన్ని తినడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని మిన్నేసోటా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం బాగా స్టీక్ చేసిన ఆహారం తినని వారితో స్టీక్ చేసిన ఆహారం తినే వాళ్ళని పలిస్తే 60 శాతం మందికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. 


Also Read: Chinese Spy Balloons: భారత్‌పైనా చైనా స్పై బెలూన్ నిఘా,సంచలన విషయం చెప్పిన అమెరికా