PG Indira Gandhi Scholarship for Single Girl Child: భారత దేశంలో మహిళల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. అలాంటి వాటిలో ముఖ్యమైందే పోస్టు గ్రాడ్యుయేట్ ఇందిరాగాంధీ స్కాలర్‌షిప్‌ ఫల్ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌(PG Indira Gandhi Scholarship for Single Girl Child) ఈ పథకం ఒంటరి బాలికలకు పోస్టు గ్రాడ్యుయేట్ విద్యను ఈజీ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్. 2006-07 విద్యా సంవత్సరంలో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా ప్రవేశ పెట్టింది కేంద్రం. లింగ సమానత్వం పెంచడానికి మహిళల సాధికారతను ప్రోత్సహించడానికి ఈ స్కీమ్‌ను అమలు చేస్తున్నారు. 

భారత్‌లో బాలికలు ఉన్నత చదువులు చదావలంటే అంత సులభమైన విషయం కాదు. నేడు ప్రభుత్వాలు కల్పిస్తున్న పథకాలు, తల్లిదండ్రుల్లో అవేర్‌నెస్ రావడంతో డిగ్రీ వరకు తమ పిల్లలను తల్లిదండ్రులు చదివిస్తున్నారు. కానీ ఆపై చదువులు చదివించలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణంగా ఆ స్థాయిలో ఆర్థిక స్థోమత లేకపోవడమే. అందుకే ప్రభుత్వాలు పీజీ చదివించేందుకు కూడా స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నారు. అలాటిదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఇందిరాగాంధీ స్కాలర్‌షిప్‌ పథకం. 

ఈ పథకం ద్వారా కుటుంబంలోని ఒక బాలికకు పీజీ చదువుకునేందుకు ఆర్థిక సాయం చేస్తారు. ఇది మహిళలను ఉన్నత విద్యవైపు ప్రోత్సహించి వారిలో సాధికారత నడిపిస్తుందని ప్రభుత్వాల విశ్వాసం. 

పోస్టు గ్రాడ్యుయేట్ ఇందిరాగాంధీ స్కాలర్‌షిప్‌ ఫల్ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ పథకం ముఖ్య లక్ష్యాలు 

  • ఒంటరి బాలికలకు విద్యా అవకాశాలు కల్పించడం 
  • లింగ అసమానతలు తగ్గించడం
  • మహిళల ఆర్థిక స్వాతంత్య్రం పెంచడం
  • యూజీసీ డేటా ప్రకారం గత 15 ఏళ్లలో ఈ పథకం ద్వారా వేల మంది బాలికలు ఉన్నత విద్యను అభ్యసించారు. 
  • ఈ ఏడాదికి ఆగస్టు ఐదో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 
  • అక్టోబర్‌ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం ఎంపిక పూర్తి చేసి అర్హులకు స్కాలర్‌షిప్‌ మంజూరు చేస్తారు. 

పోస్టు గ్రాడ్యుయేట్ ఇందిరాగాంధీ స్కాలర్‌షిప్‌ ఫల్ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌కు అర్హతలు ఏంటీ?

  • అభ్యర్థి కుటుంబంలో ఒకే బాలిక ఉండాలి 
  • కవలలు అయితే ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు.
  • అభ్యర్థి వయసు 30 ఏళ్ల లోపు ఉండాలి. 
  • యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్శిటీలో లేదా కాలేజీలో  పీజీలో చేరి ఉండాలి. అంటే మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవాలి. 
  • డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ లేదా సర్టిఫికెట్‌ కోర్సులు చేస్తున్న వాళ్లు అర్హులు కారు. 
  • గ్రాడ్యుయేషన్‌లో మంచి మార్కులు వచ్చి ఉండాలి 
  • ఇన్ని మార్కులు ఉండాలనే కచ్చితమైన నిబంధన ఏమీ లేదు.
  • కుటుంబ ఆదాయ పరిమితి లేదు. 
  • ఇతర స్కాలర్‌షిప్‌లు పొందుతున్న వాళ్లు అనర్హులు 

పోస్టు గ్రాడ్యుయేట్ ఇందిరాగాంధీ స్కాలర్‌షిప్‌ ఫల్ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ ద్వారా ఎంత స్కాలర్ వస్తుంది

ఈ పథకంలో ఎంపికైన విద్యార్థికి ఏడాదికి 36,200 రూపాయలు ఇస్తారు. రెండేళ్లకు 72400 అందుకోవచ్చు. ప్రతి ఏటా 3000 మందిని సెలక్ట్ చేస్తారు. రెగ్యులర్‌గా వెబ్‌సైట్‌ను చెక్ చేస్తూ ఉండాలి. ఈ స్కాలర్‌షిప్‌తో చదువుకున్న చాలా మంది నేడు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరికొందరు కాంపిటీషన్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. 

పోస్టు గ్రాడ్యుయేట్ ఇందిరాగాంధీ స్కాలర్‌షిప్‌ ఫల్ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌కు ఎలా అప్లై చేయాలి.

  • అప్లికేషన్ నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్ ద్వారా అప్లై చేయాలి. 
  • ముందుగా ఎన్‌ఎస్‌పీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి

పోస్టు గ్రాడ్యుయేట్ ఇందిరాగాంధీ స్కాలర్‌షిప్‌ ఫల్ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ కోసం  అవసరమైన డాక్యుమెంట్స్

అడ్మిషన్ ప్రూఫ్‌, ఒంటరి బాలిక అనే చెప్పేలా సర్టిఫికెట్ ఇవ్వాలి. లేదా అఫిడవిట్ సమర్పించాలి. ఇది 50 రూపాయల స్టాంప్ పేపర్‌పై తల్లిదండ్రులు సంతకం చేసి సమర్పించాలి. 

  • ఆధార్ కార్డు 
  • బ్యాంకు ఖాతా వివరాలు 
  • మార్కు షీట్లు, 
  • అప్లికేషన్ ప్రక్రియ ఆగస్టు 5 నుంచి ప్రారంభమైంది. 
  • చివరి తేదీ నవబర్ 30
  • మెరిట్ ఆధారంగా సెలక్షన్ ప్రక్రియ ఉంటుంది.