Do You Think The Free Bus Facility Will Empower The Women : ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్‌ ప్రయాణ పథకం ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ సహా ఇతర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఢిల్లీ నుంచి మొదలైన ఈ పథకం చాలా రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కేరళలోనే ఈ పథకం లేదు. మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉంది. అయితే ఈ పథకం ఈ స్థాయిలో అమలు చేయడం వల్ల జరిగే ప్రయోజనం ఏంటీ? ఇది ఓట్ల పథకమా లేకా ఆర్థిక ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ఈ విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

ఉచిత బస్ ప్రయాణ పథకం వల్ల మహిళలకు మరింత ఆర్థిక స్వావలంబన కలుగుతుందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కొన్ని పరిశోధనల వల్ల ఈ పథకం ప్రవేశ పెట్టిన రాష్ట్రాల్లో మహిళలు నెలకు ఐదు వేల వరకు ఆదా ఆవుతుందని అంటున్నారు. మహిళలు తమ ప్రయాణ ఖర్చుల్లో 32-53 శాతం వరకు తగ్గుతుంది. ఆ డబ్బులను మహిళలు తమ ఇంటి అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఇలాంటి మహిళలు 54 శాతం మంది ఉంటున్నారట. 15 శాతం మంది మహిళలు ఈ మిగిలిన డబ్బులను విద్య, ఆరోగ్యంపై ఖర్చు పెడుతున్నారు.  

సామాజిక వ్యక్తిగత స్వేచ్ఛ

ఉచిత ప్రయాణం వల్ల మహిళలు స్వేచ్ఛగా ప్రయాణం చేయగలుగుతున్నారని పరిశోధనలు చెబుతున్నారు. దాదాపు 67 శాత మంది మహిళలు స్వతంత్రంగా ట్రావెల్ చేయగలుగుతున్నారని పేర్కొంటున్నారు. ఈ పథకం అమలులో ఉన్న రాష్ట్రాల్లో మహిళలు విద్య, ఉపాధిపై ఆసక్తి పెంచుకున్నారని ఇది 49 శాతానికి పెరిగిందని తేలింది. ఫ్రీగా ప్రయాణం చేయడం వల్ల కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారని ఈ సంఖ్య 64 శాతానికి పెరిగినట్టు స్టడీస్ చెబుతున్నాయి. మహిళలు తీర్ధయాత్రలు, కుటుంబ సందర్శనలు, పార్కులకు వెళ్లడం,వినోద కార్యకలాపాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు తేలింది.

భద్రతకు భరోసా

భద్రత విషయంలో కూడా పరిస్థితులు మెరుగుపడ్డాయిని అంటున్నారు. ఆర్టీసీ బస్‌లలో మహిళలు నిరభ్యంతరంగా ప్రయాణం చేస్తున్నారు. ప్రైవేటు క్యాబ్‌లు, ఆటోలను నమ్ముకొని ఇబ్బంది పడటం కంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని మహిళలు అభిప్రాయపడుతున్నారు. 

ఉచిత బస్ ప్రయాణ పథకం అమలులో ఉన్న రాష్ట్రంలో ఏం జరిగింది?
రాష్ట్రం     ఉద్యోగాల పెరుగుదల శాతం 
కర్ణాటక  బెంగళూరులో 23 శాతం, హుబ్లీ - ధార్వాడ్‌లో 21 శాతం పెరుగుదల 
తెలంగాణలో  వార్షిక వృద్ధి రేటు 15-20 శాతం 
తమిళనాడు  బస్ వాడకంలో 75 శాతం పెరుగుదల 

ఉచిత ప్రయాణం ఉన్న రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు కూడా పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. 

రాష్ట్రాల వారీగా ప్రగతి ఇలా ఉంది 

ఢిల్లీ

  • 2024 వరకు వంద కోట్ల పింక్ టికెట్లు జారీ చేశారు. 
  • మహిళల బస్ వాడకం ఏటా పెరుగుతూనే ఉంది. 2020-21లో 25 శాతం ఉంటే 2022-23లో అది 33 శాతానికి పెరిగింది. 
  • ప్రతి రోజూ ఐదు లక్షల మంది ఉచిత పథకాన్ని వాడుకుంటున్నారు. 

కర్ణాటక 

  • పథకం ప్రారంభమైన 2023 నుంచి 474.82 కోట్లు ఉచిత ప్రయాణాలు రిజిస్టర్ అయ్యాయి
  • ఆర్టీసీకి ప్రభుత్వం 11, 994 కోట్లు రూపాయలు చెల్లించింది. 
  • ఈ పథకం వల్ల బెంగళూరులో మహిళల ఉద్యోగ రేటు 23 శాతం పెరిగింది.  
  • బస్‌లు ఎక్కే వారి సంఖ్య 27 శాతం పెరిగింది. 

తెలంగాణ 

  • 2023 డిసెంబర్ నుంచి 2025 జులై వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి అయ్యాయి.  రోజుకు 35 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. 
  • పథకం తర్వాత బస్‌లు ఎక్కే మహిళల సంఖ్య 62 శాతం పెరిగింది. 
  • ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం 6680 కోట్లు చెల్లించింది. 

తమిళనాడు

  • తమిళనాడులో రోజూ 28 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. 2021 నుంచి బస్‌లో ప్రయాణించే మహిళల శాతం 75 శాతం పెరిగింది.  ఈ పథకం వల్ల కనీసం రోజుకు 800 రూపాయులు మిగులుతున్నాయి. 
  • మహిళల ఉచిత బస్ ప్రయాణం కోసం ఏ రాష్ట్రం ఎంత ఖర్చు పెడుతుంది
ఉచిత బస్ ప్రయాణ పథకానికి కేటాయింపులు ఇలా ఉన్నాయి?
రాష్ట్రం వార్షిక బడ్జెట్‌ రిటర్న్ ఇండికేటర్లు
ఢిల్లీ   340కోట్లు
  • జీఎస్టీ వసూళ్లు పెరుగుదల
  • పని చేసే మహిళల సంఖ్య పెరుగుదల 
కర్ణాటక   5000 కోట్లు
  • నెలకు 34 కోట్ల రూపాయల అదనపపు జీఎస్టీ వసూళ్లు
తెలంగాణ 3000 కోట్లు
  • 53 శాతం ఆక్యుపెన్సీ పెరుగుదల 
తమిళనాడు 1200-1500 కోట్లు
  • మహిళల ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. 

ప్రభుత్వ రవాణా సంస్థల బలోపేతం 

ఉచిత బస్ పథకం వల్ల ఆక్యుపెన్సీ రేటు పెరగడంతో రవాణా సంస్థలు నష్టాల నుంచి బయటపడుతున్నాయి. ఉచిత పథకం బకాయిలను సకాలంలో చెల్లించినట్టు అయితే అలాంటి రవాణా సంస్థలు క్రమంగా కోలుకుంటున్నాయి.