Watch Video: 


ఎంబసీలో దీపావళి వేడుకలు 


Diwali News: భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలోనూ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికా దౌత్యవేత్తలు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. యూఎస్ దౌత్యవేత్త ఎరిక్ గర్సెట్టి (Eric Garcetti) దీపాలు వెలిగించి, ముగ్గులు పెట్టారు. ఆపై స్వీట్‌లు పంచారు. భారత్‌లో తొలిసారి దీపావళి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఆయనతో పాటు మరి కొందరు యూఎస్ ఎంబసీ అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అందరితో కలిసి డ్యాన్స్ చేశారు అమెరికన్లు. దిల్‌సే సినిమాలోని ఛయ్య ఛయ్యా సాంగ్‌కి స్టెప్పులేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేయగా..వైరల్ అయింది. బ్లూ కుర్తా వేసుకుని, సన్‌గ్లాసెస్‌ పెట్టుకుని డ్యాన్స్ చేశారు. నిజానికి...యూఎస్ ఎంబసీలో ముందుగానే దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి.





గత నెలలోనే అధికారులు ట్విటర్‌లో కొన్ని వీడియోలు షేర్ చేశారు. కొందరు అమెరికన్ మహిళలు భారతీయ దుస్తులు ధరించారు. సత్యమేవ జయతే సినిమాలోని దిల్‌బర్‌ సాంగ్‌కి స్టెప్పులేశారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. "అప్పుడే దీపావళి వేడుకలు మొదలు పెట్టాం" అంటూ ఆ అధికారులు ట్వీట్ చేశారు. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ఆ అమెరికన్ మహిళలపై ప్రశంసలు కురిపించారు. "అద్భుతంగా డ్యాన్స్ చేశారు" అని కామెంట్స్ పెట్టారు.