Maharastra News :  మహారాష్ట్రలో శివసేన కీలక నేత ఏక్‌నాథ్ షిండే మరో పది మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేయడం సంచలనం సృష్టిస్తోంది. అక్కడ కూడా మధ్యప్రదేశ్, కర్ణాటకల మాదిరిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న చర్చ ప్రారంభమయింది. అయితే ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ బలాబలాలు వేరు.. మహారాష్ట్రలో ఉన్న రాజకీయ బలాలు వేరు. ప్రస్తుతం పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే తిరుగుబాటు చేసి ఉంటే ప్రభుత్వాన్ని నిలుపుకోవడం ముఖ్యమంత్రి ఉద్దవ్ ధాకరేకు పెద్ద కష్టం కాబోదు. 


కేసీఆర్‌కు శరద్ పవార్ ఫోన్ - యశ్వంత్ సిన్హాకు మద్దతివ్వాలని విజ్ఞప్తి



మ‌హారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. శివ‌సేన ఎమ్మెల్యే ర‌మేశ్ మృతితో ఒక సీటు ఖాళీగా ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 144సీట్లు కావాలి.  ప్రస్తుతం అధికారికంగా  శివ‌సేన‌కు 55 సీట్లు, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44 స్థానాలు ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడీ పేరుతో కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మొత్తం 152 ఎమ్మెల్యేల బలం ఉంది. 


ప్రిన్సిపాల్‌కు ఎమ్మెల్యే చెంప దెబ్బలు - గురువుల్ని ఇలా కూడా తంతారా ?


అయితే  బీజేపీకి 106 సీట్లుమాత్రమే ఉన్నాయి.  బ‌హుజ‌న్ వికాస్ అగాధీకి 3, స‌మాజ్‌వాదీ, ఎంఐఎం, జ‌న‌శ‌క్తి పార్టీల‌కు తలా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.  ఎంఎన్ఎస్, సీపీఐ, పీడ‌బ్ల్యూపీ, స్వాభిమాన్‌, రాష్ట్రీయ స‌మాజ్ ప‌క్ష్‌, జ‌న‌సూర‌జ్య‌శ‌క్తి, క్రాంతికార్ షేత్కారి పార్టీల‌కు ఒక్కొక్క సీటు ఉన్నాయి. వీరితో మరో  13 మంది స్వతంత్య్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎస్పీ, ఎంఐఎం లాంటి పార్టీలు బీజేపీకి మద్దతిచ్చే చాన్స్ లేదు. ఇండిపెండెంట్లు  అందరూ బీజేపీ వైపు ఉండరు. కానీ బలపరీక్షలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయవచ్చు. 


వెంకయ్య నాయుడు లేదా అనసూయ ఊకే ! ఈ ఇద్దరిలో ఒకరే రాష్ట్రపతి !


ప్రస్తుతం శివసేన ఎమ్మెల్యేలు మనసు మార్చుకోకపతే బలపరీక్షకు బీజేపీ పట్టుబట్ట వచ్చు. శివసేనకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జైల్లో ఉన్నారు. వారికి ఓటు వేసే చాన్స్ లేకపోతే ఆ కూటమి బలం తిరుగుబాటు ఎమ్మెల్యేలు కాకుండా 140కే పరిమితం అవుతుంది. బీజేపీ ఇతర పక్షాలన్నీ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ప్రభుత్వం పడిపోతుంది. కానీ అది సాధ్యమేనా అన్నది తదుపరి రాజకీయ పరిణామాలపై ఉంటుంది. మరింత మంది ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే క్యాంప్‌నకు వెళ్లకపోతే ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది.