JD(S) MLA slapped college principal :   కర్ణాటకలో జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ తన నియోజకవర్గంలో ఉన్న ఓ కాలేజీని ఆకస్మిక తనిఖీ చేశారు. అన్ని చూసిన తర్వాత ఆ కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్ పని ఎక్కడి వరకు వచ్చిందని ప్రిన్సిపల్‌ను అడిగారుు. అయితే ఆ ప్రిన్సిపల్ వెంటనే సమాధానం చెప్పలేకపోయారు. అంతే ఆ ఎమ్మెల్యేకు కోపం వచ్చింది. ఆయన కాలేజీ ప్రిన్సిపాల్ అనే విషయం కూడా మర్చిపోయి రెచ్చిపోయారు. చెంపదెబ్బలు కొట్టారు.

  





ప్రిన్సిపాల్‌పై ఎమ్మెల్యే దాడి చేస్తున్న వీడియో వైరల్ అయింది.  ఎమ్మెల్యే తీరుపై సోషల్ మీడియాలో అనేక రకాల విమర్శలు వినిపిస్తున్నాయి. 


 





 


 జేడీఎస్ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై సాధారణ ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  ఓ కాలేజీ ప్రిన్సిపాల్ విషయంలో ఇలా దాడి చేయడం ఏమిటన్న వాదన వినిపిస్తున్నారు.  ఎమ్మెల్యే ప్రిన్సిపాల్‌కు క్షమాపమ చెప్పాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో  జేడీఎస్ నాయకులు ఇంకా స్పందించలేదు. కాలేజీలో జరిగే పనులుపై సంతృప్తి లేకపోతే ఆయనపై శాఖపరంగా చర్యలు తీసుకోవచ్చు కానీ దాడి చేయడం మాత్రం కరెక్ట్ కాదంటున్నారు. 


ఉద్యోగ సంఘ నేతలు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  కర్ణాటకలో జేడీఎస్ అధికార పార్టీ కాదు. విపక్ష పార్టీ.  ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.  ఈ అంశంపై జేడీఎస్ పై ఇతర  పార్టీల నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.