Bomb Threat : ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి వస్తున్న విస్తారా విమానంలో బాంబు ఉందన్న వార్త సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి లేఖ విమానంలో లభించడంతో సిబ్బందిలో భయాందోళన నెలకొంది.  దీనిపై వెంటనే సదరు సిబ్బంది ముంబై విమానాశ్రయానికి సమాచారం అందించారు. వెంటనే అలర్టై విస్తారా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 306 మంది ఉన్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ప్రకటించి విమానాన్ని ల్యాండ్ చేసి విమానం మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశౄరు. అయితే ఈ విమానంలో బాంబులాంటిది ఏమీ  దొరకలేదు. గతంలో చెన్నై నుంచి ముంబై, ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లే విమానాల్లో బాంబు ఉందన్న వార్తలతో భయాందోళనలు నెలకొన్నాయి. 


కలకలం సృష్టించిన లేఖ
ప్యారిస్ నుంచి ముంబై వస్తున్న విస్తారా విమానంలో బాంబు పేలుడు వార్త కలకలం రేపింది. ఈ సమాచారాన్ని వెంటనే ముంబై ఎయిర్‌పోర్ట్‌కు అందించారు. దీంతో అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అలాగే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా చేశారు. వాస్తవానికి, విమానంలోని ఎయిర్ సిక్‌నెస్ బ్యాగ్‌లో చేతితో రాసిన లేఖను కనుగొన్నారు. ఇందులో విమానంలో బాంబు ఉందన్న సమాచారం రాశారు. విమానంలో 306 మంది ప్రయాణికులు ఉన్నారు. బాంబు ఉన్నట్లు సమాచారం అందడంతో విమానాన్ని  అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మొదట ప్రయాణీకులను విమానం నుండి సురక్షితంగా తరలించారు.


 ఉదయం 10:19 గంటలకు ల్యాండింగ్
ఆదివారం ఉదయం 10:19 గంటలకు పారిస్‌ నుంచి ముంబైకి వస్తున్న విస్తారా విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యిందని ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది.  ప్యారిస్‌లోని చార్లెస్ డి గల్లె అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానం నంబర్ UK 024  ముంబైకి వెళ్లినట్లు విస్తారా ఎయిర్‌లైన్స్ తెలిపింది. దీని తర్వాత విమానంలోని సిక్‌నెస్ బ్యాగ్‌లో చేతితో రాసిన లేఖ దొరికింది, అందులో విమానంలో బాంబు ఉందని రాశారు. దీంతో ఆదివారం ఉదయం 10:08 గంటలకు ముంబై ఎయిర్ పోర్టులో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానంలో 294 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు.


సరిగా రెండ్రోజుల క్రితం కూడా..
శుక్రవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న యూకే611 విమానంలో బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. బెదిరింపు కాల్ రావడంతో విమానాశ్రయ అధికారులు శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెంటనే చర్యలు చేపట్టారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) శ్రీనగర్‌కు 'బెదిరింపు కాల్' వచ్చింది.  దీని తర్వాత సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) వెంటనే చర్య తీసుకొని స్పందించింది. పూర్తి తనిఖీల తర్వాత బాంబులు లేవని తేల్చింది. తర్వాత సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని విమానాశ్రయ అధికారి తెలిపారు.


ఇండిగో విమానాన్ని పేల్చివేస్తామని బెదిరింపులు
గతంలో చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానాన్ని పేల్చి వేస్తామని బెదిరింపులు వచ్చాయి. విమానాన్ని బాంబుతో పేల్చివేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. బాంబు బెదిరింపు వచ్చిన వెంటనే భద్రతా సంస్థలు అప్రమత్తమై కేసు దర్యాప్తు ప్రారంభించాయి. ముందుగా ఇండిగో విమానంలో ఉన్న ప్రయాణికులందరినీ సురక్షితంగా దించి విమానంలో సోదాలు చేపట్టారు. ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని ఐసోలేట్ చేశారు.