Viral Video: పెళ్లంటే నూరేళ్లపంట అంటారు పెద్దలు. జీవితంలో ఒకసారి చేసుకునే ఈ వేడుకను ఎంతో ఘనంగా చేసుకోవాలని అనుకుంటారు. అందుకోసం మంచి ముహుర్తాలు చూసుకుని, ఒక అద్భుతమైన స్థలంలో పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటారు. ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు ఇరువురి కుటుంబ సభ్యులు. కానీ, ఓ జంట పొలంలోనే పెళ్లి పెట్టుకోవడంతో భారీ వర్షం పడి పెళ్లికి తీవ్ర అంతరాయం కలిగింది. 


కుర్చీలు, గొడుగులు అడ్డుగా పెట్టుకుని... 


పెళ్లి కోసం ఆ జంట పొలాన్ని ఎంచుకున్నారు. పొలం మధ్యలో భారీ టెంట్ల కింద ఏర్పాట్లు చేశారు. పెళ్లికి వచ్చిన బంధువుల వాహనాలు పార్క్ చేసేందుకు కూడా స్థలాలను కేటాయించారు. అయితే, పెళ్లి మొదలైన కాసేపటికే భారీ వర్షం మొదలైంది. వర్షం కారణంగా టెంట్లు తడిసి ఓ పక్కన ఊడిపోయి కింద పడ్డాయి. టెంట్ల కింద కూర్చుని భోజనం చేస్తున్న బంధువులు ప్లేట్లను పట్టుకుని పరుగులు తీశారు. మరికొందరేమో కూర్చీలు అడ్డుపెట్టుని మరి భోజనాలు చేశారు. ఇక వధువరులు గొడుగు పట్టుకుని వర్షంలో తడుస్తూ ఉండిపోయారు. 


&nbsp






ఫన్నీ కామెంట్స్..


వర్షం కారణంగా టెంట్లన్ని తడిసిపోయాయి. పొలంలో పెళ్లి పెట్టుకోవడంతో ఎటుచూసినా బురద మాత్రమే కనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్లి తలదాచుకుందాం అన్నా చెట్లు కూడా కనిపించట్లేదు. దీంతో పెళ్లికి వచ్చిన పలువురు అతిథులు ఉండలేక తమ ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వాహనాలను తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా బురదలో ఇరుక్కుపోయాయి. పొలం అంతా తడిసి వాహనాలు వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో బంధువులకు ఇబ్బందులు కలగకుండా పెళ్లివారు ట్రాక్టర్ సహాయంతో నెమ్మదిగా వాహనాలను రోడ్డుకి చేర్చారు. మరికొంత మంది మాత్రం ఆ వర్షంలోనే అవస్థలు పడుతూ కర్రలతో తమ బైక్ లను నెట్టుకుంటూ రోడ్డుకు చేర్చగలిగారు. ఇక మరికొంత మంది వర్షం తగ్గుతుందిలే అని తడుస్తూ ఉండిపోయారు. ఈ పెళ్లికి  సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇవన్నీ మామూలే అనుకున్నా ఈ వీడియో మాత్రం నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు ‘వర్షాకాలంలో పెళ్లిళ్లు పెట్టుకునే ముందు పండితులను కాకుండా వాతావరణ శాఖ సలహా, తేదీలు తీసుకోవాలి. లేదా వాటర్ ప్రూఫ్ టెంట్లను వేయించుకోవాలని’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.  ఇక, ఏది ఏమైనా వర్షాకాలంలో పెళ్లిళ్లు చేసుకోవాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటే కాస్త ఆచితూచి వ్యవహరించాలి. ఒకవేళ పెళ్లి పెట్టుకున్నా ఏ ఫంక్షన్ హాల్ లోనో పెట్టుకోవాలి, కానీ ఇలా బహిరంగ ప్రదేశాల్లో పెళ్లిళ్లు పెట్టుకుంటే ఇలాగే అవుతుంది మరి.