ఇటీవల పబ్జి ప్రియుడి కోసం పాకిస్తాన్ మహిళ నలుగురు పిల్లలతోపాటు బోర్డర్ దాటి మరీ గ్రేటర్ నోయిడాకి వచ్చింది. అ ప్రేమ కథ మరువక ముందే అలాంటి ప్రేమ కథే ఒకటి జార్ఖండ్‌లో జరిగింది.  ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమించిన వ్యక్తి కోసం ఓ మహిళ ఏకంగా పోలండ్ నుంచి జార్ఘండ్ వచ్చింది. ప్రపంచంలో అందమైనది ప్రేమ. దానికి హద్దులు లేవంటారు ప్రేమ కవులు. దేశాలు, ఖండాలు దాటిన ప్రేమలు మనం చూస్తూనే ఉంటాం. ఇంటర్నెట్ పుణ్యమా అంటూ ప్రపంచం మొత్తం ప్రేమను వెతికేవారు ఎక్కువైపోయారు. తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకోవడం కోసం ఇంటర్నెట్‌లో సోషల్ మీడియా వేదికగా వెతుకునే వారిని చూసే ఉంటాం. 


ఇన్‌స్టాగ్రాం లవ్
పోలండ్‌కు చెందిన మహిళా పోలాక్‌ బార్బరా (45). ఈమెకు ఆరేళ్ల కుమార్తె ఉంది. ఇటీవలే  పోలక్ భర్తతో విడాకులు తీసుకుని వేరుగా ఉంటోంది. భారత్‌లోని జార్ఖండ్‌  రాష్ట్రం హజారీబాగ్‌ జిల్లా ఖుత్రా గ్రామానికి చెందిన మహ్మద్‌ షాదాబ్‌ (35)తో 2021లో ఇన్‌స్టాగ్రాం ద్వారా  పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.  పోలండ్ నుంచి కొద్దిరోజుల క్రితం హజారీబాగ్‌ చేరుకొని షాదాబ్‌ను కలిసి అతడితో ఉంటోంది. 


అక్కడి వేడికి తట్టుకోలేకపోతున్న పోలక్ కోసం షాదాబ్‌ ఏసీ ఏర్పాటు చేయించాడు.  ఈ సందర్భంగా ఆమెను చూడటానికి చుట్టపక్కల నుంచి నిత్యం వంద మందికి పైగా వస్తున్నారు. తన కోసం వస్తున్న వారిని చూసి పోలక్ ఆనందం వ్యక్తం చేస్తోంది. భారత్‌ అందమైన దేశమని, ఇక్కడి ప్రజల ప్రేమ, ఆప్యాయత పంచడం గొప్ప విషయమని అంటోంది. రోజు తనను చూడటానికి  రోజూ వందలాది మంది వస్తున్నారని చెబుతోంది. 


త్వరలోనే పోలండ్‌కు వెళ్తానని చెప్పిన పోలక్
పోలాక్‌ బార్బరా హజారీబాగ్‌ జిల్లా ఖుత్రాలో ఉంటున్న విషయం ఆ నోటా ఈ నోటా పడి పోలీసుల వరకు వెళ్లింది. దీంతో  హజారీబాగ్‌ డీఎస్పీ రాజీవ్‌కుమార్‌ ఖుత్రా గ్రామానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. పోలాక్‌‌ను కలిసి మాట్లాడారు. మరికొద్ది రోజుల్లో పోలండ్‌ వెళ్లిపోతానని పోలక్ వివరించింది. షాదాబ్‌కు వీసా వచ్చాక అతడిని పోలండ్‌ తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. 


పబ్జి లవ్
పబ్‌జీ (PUBG) ద్వారా పరిచయమైన నోయిడా కుర్రాడితో ప్రేమలో పడింది పాకిస్థాన్‌ మహిళ సీమ గులాం హైదర్‌. నోయిడాలోని రబూపురకు చెందిన సచిన్‌తో పబ్‌జీకి అడిక్ట్ అయ్యాడు. అలా ఆడే క్రమంలోనే పాకిస్థాన్‌ మహిళతో పరిచయమైంది. తరచూ మాట్లాడుకునే వాళ్లు. ఆ చనువు కాస్తా ప్రేమగా మారింది. మే 13న ఆ పాకిస్థాన్ మహిళ ఇల్లు వదిలి వచ్చేయాలని ఫిక్స్ అయింది. అనుకున్న వెంటనే నలుగురు పిల్లల్ని తీసుకుని బార్డర్ దాటి ఇండియాకు వచ్చేసింది. గ్రేటర్ నోయిడాలోనే సచిన్‌తో పాటు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. ఈ ప్రేమ కథ రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial