తెలుగు డిజిటల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టిన ఏబీపీ నెట్‌వర్క్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో మీడియాకు ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు విశిష్టమైన బాధ్యతలు ఉన్నాయని ... రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో సమాజం ఆకాంక్షలను ఎప్పటికప్పుడు పాలకులకు తెలియచేస్తూ.. సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని ఆకాంక్షించారు. భారత్‌లో మీడియా ఎప్పుడూ క్రియాశీలక పాత్ర పోషిస్తోందని.. నాటి ఎమర్జెన్సీ దగ్గర నుంచి నేటి కరోనా పరిస్థితుల వరకూ మీడియా నిర్వర్తించిన బాధ్యతను గుర్తు చేసి.. అభినందించారు. శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక సందేశం పంపించారు.
ప్రజల్లో జాతీయ భావాన్ని ..సమాజం పట్ల పర్యావరణం పట్ల మరితం బాధ్యతను పెంపొందించడంలో మీడియా మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుల్లో చైతన్యం కలిగించడం.. వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేయడం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏబీపీకి పంపిన సందేశంలో పేర్కొన్నారు. ఏబీపీ తెలుగు ప్రయాణం విజయవంతంగా ముందుకు సాగాలని .. ప్రజాపక్షం వహిస్తూ.. సామాజిక పురోగతిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఉత్తరాది ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న ఏబీపీ గ్రూప్ తెలుగు డిజిటల్ మీడియా రంగంలో అడుగు పెడుతోందని తెలిసి సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు గడ్డపై.. ఏబీపీ మరింత మెరుగ్గా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ... వ్యవస్థలకు మరితం జవాబుదారీతనం పెంచేలా.. మీడియా శక్తిని చూపించాలని ఆకాంక్షించారు.
దేశంలో ప్రముఖ న్యూస్ నెట్‌వర్క్‌గా ఉన్న ఏబీపీ జూలై ౩౦న తెలుగు మీడియా రంగంలో అడుగుపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా డిజిటల్ వార్తా సేవలను ప్రారంభించింది. ప్రత్యేకమైన న్యూస్ వెబ్‌సైట్‌తో పాటు, యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ మాధ్యమాల ద్వారా తెలుగు వీక్షకులకు చేరువవుతోంది