Venkaiah Naidu: దేశవ్యాప్తంగా మాతృ భాషల్లో విద్యా బోధనకు కేంద్ర విద్యాశాఖ చొరవ తీసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. మాతృ భాషలో విద్యా బోధన జరగాలని తాను చాలాసార్లు సూచిస్తూనే ఉన్నానని ఊ సందర్భంగా చెప్పుకొచ్చారు. రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో పొందుపరిచిన 22 భాషల్లో పాఠ్య పుస్తకాలు సిద్ధం చేయడానికి ఎన్సీఈఆర్టీ ఉపక్రమించడం చాలా సంతోషమన్నారు. అలాగే ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు ఈ 22 భాషల్లో ఏ భాషలో విద్యా బోధనను ఎంచుకోవాలనేది సీబీఎస్సీకి ఇవ్వటం మరింత స్ఫూర్తిదాయకమని వివరించారు. అంతే కాకుండా సామాజికంగా, ఆర్థికంగా మన సర్వతోముఖాభివృద్ధిని అడ్డుకుంటున్న వలస పాలన అవశేషాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నం అయిందని పేర్కొన్నారు. స్థానిక భాషలకు సమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన తరుణం ఇదేనంటూ వ్యాఖ్యానించారు.
పిల్లలు పూర్వప్రాథమిక స్థాయి నుంచే మాతృభాషపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ఇతర భాషలను తెలుసుకుుంటే బహుబాషావాదం చిన్నారుల ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తుందని జాతీయ విద్యా విధానం - 2020 కూడా బలంగా చెబుతోంది. కనీసం ఐదో తరగతి వరకు ఈ విధానం అనుసరించాలని 8వ తరగతి వరకు కూడా ఇదే విధానం మేలని చెబుతోంది.