Uttarkashi Tunnel Rescue Success: పరుగు పరుగు గుట్ట ఎక్కుతూ అక్కడ ఉన్న చిన్న దేవుడి ప్రతిమకు సాగిలపడిన ఈయన పేరు ఆర్నాల్డ్ డిక్స్. గడిచిన పదిహేడు రోజులుగా భారత్ మీడియాలో మోగిపోతున్న ఈయనది ఆస్ట్రేలియా. కానీ జెనీవా కేంద్రంగా International Tunnelling and Underground Space Association అనే సంస్థను నడుపుతూ.. ప్రపంచప్రఖ్యాత టన్నెల్ ఎక్స్ పెర్ట్ గా పేరు తెచ్చుకున్నారు. అంటే ప్రపంచంలో అతిప్రమాదకరమైన సొరంగాల తవ్వకాలు, వాటిలో నిర్మించే కట్టడాలు, సేఫ్టీ మెజర్మెంట్స్ గైడెన్స్ ఇలా అనేక విభాగాల్లో ప్రపంచలోనే టాప్ టెక్నీషియన్ గా ప్రొఫెసర్ గా లీగల్ ఎక్స్ పెర్ట్ గా అనేక విభాగాల్లో ఆర్నాల్డ్ డిక్స్ కి పేరుంది.


ఆయనకున్న నలభై ఏళ్ల అనుభవంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టన్నెల్స్ నిర్మాణంలో అక్కడ ఏర్పడిన సమస్యల్లో ఆర్నాల్డ్ టెక్నికల్ సపోర్ట్ ఇచ్చారు. అలా ఈ నెల ఉత్తరాఖండ్ లో ఉత్తరకాశీలో జరిగిన టన్నెల్ ప్రమాదంలో 41మంది కూలీలు చిక్కుకుపోయారని భారత ప్రభుత్వం ఆర్నాల్డ్ కి కబురు పంపింది. తన టీమ్ తో భారత్ కి వచ్చి పని మొదలుపెట్టిన ఆర్నాల్డ్ కు సంక్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయి. తొలుత ఓ పైపును సొరంగంలోని శిథిలాల్లోకి పంపి కూలీలను పైకి తేవాలని ప్రయత్నించినా డ్రిల్లింగ్ చేస్తున్న అగర్ మెషీన్ బ్లేడ్లు విరిగిపోయాయి. దీంతో ఆ బ్లేడ్లు కట్ చేసేందుకు మరింత సమయం పట్టింది. మరో వైపు ఆల్టర్నేటివ్ గా సొరంగం పక్కన కొండను సైతం నిలువుగా డ్రిల్ చేయటం మొదలుపెట్టారు. ఈ పనులు అన్నింటిలో కీలకపాత్ర పోషించిన ఆర్నాల్డ్ డిక్స్ ఈ రోజు రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి కనిపించగానే స్పిరుచ్యువల్ ఎమోషన్ కి లోనయ్యారు. పరుగు పరుగును గుట్ట ఎక్కి అక్కడే ఉన్న దేవుడికి సాగిలపడ్డాడు. దేవుడికి దణ్ణంపెట్టుకుంటూ రెస్క్యూ ఆపరేషన్ పూర్తై కూలీలు సేఫ్ గా బయటకు రావాలని ఆయన పడుతున్న తపన అక్కడ అందరినీ కదిలించివేసింది.



ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో గత 17 రోజుల క్రితం చిక్కుకు పోయిన 41 మంది కూలీలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వీరిని నేడు బయటకు తీసుకొస్తామని రెస్క్యూ సిబ్బంది మంగళవారం (నవంబర్ 28) ఉదయమే ప్రకటించారు. మొదట ఇద్దరు, తర్వాత మరో నలుగురుతో కాసేపటికే మొత్తం 41 మంది కార్మికులను సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చారు. కూలీలను టన్నెల్‌ నుంచి బయటకు తీసుకొస్తున్న సమయంలో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి అక్కడే ఉండి ఒక్కో కూలీని పలకరించారు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్మికులను బయటకు తెచ్చేందుకు దాదాపు 17 రోజులు పట్టింది. అయితే అదృష్టవశాత్తూ వారికి ఆహారం అందించేందకు `మార్గం దొరకడంతో రెస్క్యూ టీమ్ కు టెన్షన్ సగం తగ్గింది. మరోవైపు అమెరికా మిషన్ తో డ్రిల్లింగ్ చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో కూలీలను బయటకు తెచ్చేందుకు మరికొన్ని రోజులు ఆలస్యమైంది.
Also Read: 17 రోజుల తరువాత టన్నెల్ నుంచి క్షేమంగా బయటపడిన 41 మంది కార్మికులు


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply