Uttarakhand UCC Panel: 



ఉత్తరాఖండ్‌ కమిటీ..


దేశవ్యాప్తంగా యునిఫామ్ సివిల్ కోడ్ (UCC)పై చర్చ జరుగుతున్న క్రమంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం వేగం పెంచింది. ఇప్పటికే ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. త్వరలోనే నివేదికని సమర్పించనుంది. ఇదే క్రమంలో ఈ కమిటీ మరో బిల్‌నీ సిద్ధం చేస్తోంది. ఈ బిల్‌లోని ప్రొవిజన్స్‌ని రిపోర్ట్‌లో చేర్చినట్టు సమాచారం. గవర్నమెంట్ అందించే పథకాలకు అర్హులుగా ఉండాలంటే ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ మందిని కనొద్దు. ఒకవేళ మూడో బిడ్డను కంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రొవిజన్స్ అందవు. అయితే...UCC బిల్‌లో దీన్ని కూడా యాడ్ చేస్తారా..లేదా అన్నది ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ బిల్‌ 2018లోనే పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్స్‌ బిల్‌ కింద ప్రవేశపెట్టారు. బీజేపీ ఎంపీ, ప్రస్తుత మంత్రి సంజీవ్ బల్యాన్ ఈ బిల్‌ని ప్రవేశపెట్టారు. అప్పట్లోనే ఉత్తరాఖండ్ ప్యానెల్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. దీనిపై 125 మంది ఎంపీలు సంతకం చేశారు. The Responsible Parenthood Billగా అభివర్ణించారు. ఇది చట్టంగా మారిన 10 నెలల తరవాత నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. 


గతంలోనే పార్లమెంట్‌లో..


ఈ బిల్ ప్రకారం.."పౌరులెవరైనా సరే ఇద్దరి బిడ్డలతోనే సరిపెట్టుకోవాలి. మూడో బిడ్డని కనాలని ఉంటే మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలనూ ఆశించొద్దు. ఎలాంటి సహాయ సహకారం లేకుండానే ఆ మూడో బిడ్డను పోషించుకోవాలి". ఈ రూల్‌ని ఫాలో అయిన వారికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని ఈ బిల్‌లో కోట్ చేశారు. ఒకవేళ ఇద్దరు బిడ్డల్లో ఎవరికైనా అంగవైకల్యం ఉన్నా, ప్రమాదవశాత్తు చనిపోయినా ఈ నిబంధన వర్తించదని అందులో ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారికీ ఈ నిబంధన వర్తించేలా చూడాలని బిల్‌లో పేర్కొన్నారు. అంటే..ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రావన్నమాట. కేవలం జనాభాని నియంత్రించాలనే ఉద్దేశంతోనే ఈ బిల్‌ని పాస్ చేసినట్టు అప్పట్లో బీజేపీ ఎంపీ సంజీవ్ బల్యాన్ వెల్లడించారు. 


యూసీసీ..బీజేపీ అజెండా..



బీజేపీ అజెండాలో ఎప్పటి నుంచి యూసీసీ ప్రస్తావన ఉంది. 2014లోనే తాము అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేస్తామని హామీ ఇచ్చింది కాషాయ పార్టీ. రామ మందిరం, ఆర్టికల్ 370 సమస్యలు పరిష్కరించామని, ఇకపై యూసీసీయే తన లక్ష్యం అని చెప్పకనే చెబుతోంది. గతేడాది డిసెంబర్‌ 9 న ఓ కీలక నిర్ణయం కూడా తీసుకుంది. రాజ్యసభలో  ప్రైవేట్ మెంబర్స్‌ బిల్స్‌లో భాగంగా Uniform Civil Code in India 2020 బిల్ పాస్ అయింది. అయితే...కాంగ్రెస్, టీఎమ్‌సీ సహా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఓటింగ్‌లోనూ పాల్గొనలేదు. 63ఓట్లు అనుకూలంగా, 23 ఓట్లు వ్యతిరేకంగా నమోదయ్యాయి. అప్పటికి ఈ ప్రతిపాదనను పాస్ చేశారు. అప్పటి నుంచి  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది అధిష్ఠానం. కాకపోతే మైనార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటం వల్ల ఇన్నాళ్లూ ఆగింది. ఇప్పుడు 2024 ఎన్నికలు దగ్గర పడుతుండటం వల్ల స్పీడ్ పెంచింది. 


Also Read: కంపెనీకి లాభాలొచ్చినా హైక్‌లు ఇవ్వరా? సీఈవోనే ప్రశ్నిస్తున్న ఉద్యోగులు