Uttar Pradesh farmers: వీధి కుక్కల స్వైరవిహారం చూశాం. ఇప్పటికే చాలా మంది రక్తాన్ని కళ్ల చూశాయి. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో వీధి పశువులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పశువుల నుంచి రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిని నుంచి పంటను కాపాడుకోవడానికి నానా బాధలు పడాల్సి వస్తోంది. 


వీధి పశువులు ఉత్తర్‌ప్రదేశ్‌లో సమస్యలు సృష్టిస్తున్నాయి. మందలతో కలిసి పంటలపై దాడి చేసి నాశనం చేస్తున్నాయి. రాత్రికి రాత్రే పంటంతా నాశనమైన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ సమస్య రైతులకే కాదు ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారింది. అందుకే ప్రభుత్వం వీధి పశువుల సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. 


వీధి పశువుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటి సంరక్షణకు ప్రత్యేకంగా గోసంరక్షణ శాలనను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పశువులు మాత్రం పంట పొలాలపై దాడులు చేస్తూనే ఉన్నాయి. అందుకే రైతులు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. 


పంట పొలాలపై పశువుల దాడిని నియంత్రించేందుకు పొలాల చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు.  ఫెన్సింగ్‌తోపాటు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. నిరంతరం వాటిని పర్యవేక్షించేందుకు ఉద్యోగులను నియమించుకుంటున్నారు. 


మరికొందరు సోలార్‌ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు, స్థానిక ప్రజలు భయపడుతున్నారు. తెలియని వారెవరైనా ఈ ఫెన్సింగ్‌కు తగిలితే పెను ప్రమాదం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


ఈ వీధి పశువుల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యేక పశు సంరక్షణ శాలలు ఏర్పాటు చేశామని గుర్తు చేస్తోంది. ఆ సంరక్షణ శాలలు నిర్వహిస్తున్న వ్యక్తులు మాత్రం వీటిపై పెదవి విరుస్తున్నారు. ప్రతి పశువుకు 30 నుంచి 50 రూపాయలు ఇస్తున్నారని ఇది సరిపోవడం లేదంటున్నారు. అందుకే వాచి సంరక్షణ బాధ్యతలు చూసుకోలేకపోతున్నట్టు చెబుతున్నారు.