UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ సంస్థల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. దరఖాస్తుకు చివరితేది మార్చి 30 చివరితేది.

Continues below advertisement

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ సంస్థల్లో పనిచేయుటకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 

Continues below advertisement

వివరాలు..

* మొత్తం ఖాళీలు: 40

1) జాయింట్ డైరెక్టర్: 03

విభాగం: క్రాప్స్ డెవలప్‌మెంట్ డైరెక్టరేట్స్.

2) హార్టికల్చర్ స్పెషలిస్ట్: 01

విభాగం: సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్.

3) అసిస్టెంట్ హార్టికల్చర్ స్పెషలిస్ట్: 02

విభాగం: సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్.

4) మార్కెటింగ్ ఆఫీసర్ (గ్రూప్-3): 05

విభాగం: డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్.

5) ఎకనామిక్ ఆఫీసర్: 01

విభాగం: ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వయిజర్. 

6) సీనియర్ డిజైన్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్): 05

విభాగం: ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్స్ (నేవీ). మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్.

7) స్పెషలిస్ట్ (గ్రేడ్-3) జనరల్ సర్జరీ: 09

విభాగం: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్.

8) స్పెషలిస్ట్ (గ్రేడ్-3) ఆర్థోపెడిక్స్: 09

విభాగం: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్.

9) డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (మైనింగ్): 18

విభాగం: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్.

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ/ ఎంబీబీఎస్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 2-10 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 30-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.25.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: నియామక పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తుకు చివరితేది: 30.03.2023.

Notification

Online Application

Also Read:

సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు
సూరత్‌లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్‌వీఎన్‌ఐటీ) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనీద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

REC Recruitment: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 125 ఉద్యోగాలు, అర్హతలివే!
ఆర్ఈసీ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా మొత్తం 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌/ బీటెక్‌/ బీఈ/ డిప్లొమా/ సీఏ/ సీఎంఏ/ ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంసీఏ/ ఎంటెక్‌/ ఎంఈ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement