దేశవ్యాప్తంగా పలు ప్రముఖ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-పీజీ)కు మార్చి 20 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 20న రాత్రి నుంచి ఏప్రిల్ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
దరఖాస్తు ఫీజును డెబిట్/క్రెడిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చని సూచించారు. ఈ పరీక్షకు అభ్యర్థుల అర్హత, పరీక్ష కేంద్రాలు, పరీక్ష ఫీజు, సమయం, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తదితర వివరాలను మార్చి 20న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని సూచించారు.
దేశవ్యాప్తంగా 66 కేంద్రీయ, రాష్ట్రీయ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం గతేడాది ఎన్‌టీఏ నిర్వహించిన పరీక్షకు దాదాపు 6.07 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయం తెలిసిందే.
సీయూఈటీ పీజీ ముఖ్య తేదీలివే..
➥ దరఖాస్తుల స్వీకరణ: మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 సాయంత్రం 5 గంటల వరకు.
➥ ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు: ఏప్రిల్ 19న రాత్రి 11.50 గంటల వరకు.
➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: ఏప్రిల్ 20 - ఏప్రిల్ 23 వరకు.
➥ అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
Also Read:
ఓయూ 'దూరవిద్య'లో కొత్త కోర్సులు, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు!
ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య ద్వారా ఈ ఏడాది నుంచి 70 కోర్సులను నిర్వహించనుంది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా అనుమతినిచ్చింది. ఓయూ దూరవిద్య విభాగం పీజీఆర్‌ఆర్‌సీడీఈ ద్వారా ఈ కోర్సులను నిర్వహించనుంది. వాస్తవానికి క్యాటగిరీ-1 విద్యాసంస్థలు యూజీసీ నుంచి ఎలాంటి అనుమతి పొందకుండానే దూర విద్య కోర్సులను నిర్వహించవచ్చు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో లెక్చరర్‌షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్‌ఎఫ్) అర్హత కోసం 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్' పరీక్ష నిర్వహిస్తున్న సంగతి విదితమే. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంయుక్తంగా ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబరు) ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తాయి. ఈ ఏడాదికి గాను 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్- డిసెంబరు 202/ జూన్ 2023' నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు.
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..