డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ  భారీగా పడిపోయింది. నరూపాయి ఆల్ టైమ్ కనిష్టం 77.69 వద్దకు చేరుకుంది. వడ్డీ రేట్లు పెరుగుతాయా లేదా అనే అంశంపై ఇన్వెస్టర్లు అయోమయంలో ఉన్నారు. మరోవైపు సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ క్రమంగా పెరుగుతోంది. వ్యాపారులు నిధుల ప్రవాహాల కోసం దేశీయ షేర్ మార్కెట్ వైపు చూస్తున్నారు. డాలర్ వ్యాల్యూ మరింత పెరిగితే రూపాయి మరింతగా క్షీణించే అవకాశాలు లేకపోలేదు. 


రూపాయి విలువ తగ్గిపోతే ఓ రకంగా లాభం.. మరో రకంగా నష్టం ఉంటుంది. సామాన్యులకైతే ఎక్కువ నష్టం ఉంటుంది. ఈ క్రమంలో ట్విట్టర్‌లో రూపాయి విలువ పడిపోవడంపై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.









మీమ్స్ ఫన్నీగా ఉన్నా సమస్య తీవ్రతను తెలిపే విషయంలో మాత్రం సీరియస్‌గా ఉంటున్నాయి.









యూపీఏ హయాంలో రూపాయి విలువ పడిపోవడంపై రాజకీయ నేతలు చేసిన ప్రకటలను కొంత మంది గుర్తు చేస్తున్నారు.