New Office Rule:  ఆఫీసన్నాక ఉద్యోగులు ఉంటారు... వాళ్లు లేటుగా వస్తారు. అది కామన్. లేటుగా రాకుండా టైంకు రావాలని మేనేజర్లు తంటాలు పడతారు అది కూడా కామనే. ఓ మేనేజర్ కు ఇలాంటి తంటాల నుంచి ఓ ఆలోచన పుట్టుకొచ్చింది. అదేమిటంటే...  ఒక్క నిమిషం లేటయితే పది నిమిషాలు అదనంగా పని చేయాలనే రూల్ పెట్టారు. ఎనిమిది నిమిషాలు లేటయితే అన్ని పది నిమిషాలు.. ఆరు నిమిషాలు లేటయితే గంట అన్న మాట. ఈ నోటీసును ఆఫీసులో డిస్ ప్లే చేశారు. వెంటనే ఓ ఉద్యోగి దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్షణాల్లో వైరల్ అయింది. 





నెటిజన్లు ఊరుకుంటారు కొంత మంది ఫన్నీగా రిప్లయ్ ఇస్తున్నారు. సరే మూడు నిమిషాలు ముందొస్తాం.. అరగంట ముందు వెళ్లిపోవచ్చా అని అడుగుతున్నారు. 


 





అయితే  ఆ మేనేజర్‌కు ఇలాంటి ట్విస్టులే కాదు.. సపోర్ట్ కూడా లభిస్తోంది.  ఆయన చేసింది కరెక్టే అనే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. 


 





 





 ఇంతకీ ఆ కంపెనీ మేనేజర్‌ ఆ రూల్‌ను కొనసాగించారో ఉంచారో స్పష్టత లేదు కానీ.. ఈ అంశంపై మాత్రం సోషల్ మీడియాలో చర్చోపచర్చలు జరుపుతున్నారు. గతంలో తమ యజమానులుఎలా వ్యవహరించేవారో కొంత మంది చెబుతున్నారు . ఉద్యోగులందరికీ ఇలాంటి వారి ఎక్స్‌పీరియన్స్ ఉండే ఉంటుంది.