Trending News: ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు చాలా స్పీడ్‌గా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు రియల్‌గా ఉన్నట్టు కనిపించే భ్రమ అన్నమాట. రియల్‌గా అవుతున్నవి కొన్ని ఉంటే ఇలా ఆర్టిఫిషియల్‌గా సృష్టించి వైరల్ చేస్తున్నవి మరికొన్ని. 


అలా వైరల్ అవుతున్న ఫొటోల్లో కొందరు వృద్ధు స్కేట్ బోర్డు సాయంతో వీధుల్లో స్కేటింగ్ చేస్తున్నారు. వీటిని చూసి నెటిజన్లు తమ కళ్లను తాము నమ్మలేకపోతున్నారు. సాధారణంగా వృద్ధ మహిళలు తమ శరీరాన్ని తామే మోయలేని పరిస్థితుల్లో ఉంటారు. వయోభారంతో ఉన్న వారికి వ్యాధులు కూడా చుట్టుముడుతుంటాయి. అలాంటి పరిస్థితిలో ఉన్న వారంతా ఇలా వీధుల్లో స్కేటింగ్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. 


వాటిని చూసిన వారంతా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. జాగ్రత్తలు చెబుతున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. కామెంట్స్ చేస్తున్నవారు కొందరైతే... వాటిని షేర్ చేస్తున్న వాళ్లు మరికొందరు. చివరకు అసలు విషయం తెలిసి షాక్ తిన్న వారు ఇంకొందరు. 


స్కేటింగ్ చేస్తున్న ఫొటోల్లో ఉన్న వృద్ధులు అంతా 70 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న మహిళలే కావడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోల్లో నిజానిజాలు బయటకు తెలియగానే చాలా మంది ఉఫ్‌... అంటూ గట్టిగా గాలి పీల్చుకొని వదులుతున్నారు. మరికొందరు బిగ్గరగా నవ్వుతున్నారు. చాలా మంది యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది ఈ ఫోటోల్లో నిజమెంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ జనరేట్ చేసింది
ప్రస్తుతం ఈ ఫోటోలను ఆశిష్ జోస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ తార్కిబ్‌లో పోస్ట్ చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ చిత్రాలను రూపొందించినట్లు తెలియజేశారు. ఈ నిజం తెలిసిన వెంటనే యూజర్లు షాక్ కు గురయ్యారు. చాలా మంది యూజర్లు ఈ ఫొటోలు నిజమని, తాము నిజంగా ఆశ్చర్యపోయామని తమ రియాక్షన్‌లో పేర్కొన్నారు.






ఆ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా చిత్రాలు రూపొందుతున్నాయి.  ఈ మధ్య కాలంలో ఇందులో దేవుళ్ళ నుంచి ప్రపంచంలోని కొంతమంది ధనవంతుల వరకు ఏఐ ఫొటోలు వచ్చాయి.  ప్రస్తుతం వృద్ధ మహిళలు స్కేట్‌బోర్డును ఆస్వాదిస్తున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.