Tomato on Paytm: 



పేటీఎమ్‌లో టమాటాలు..


టమాటా ధరలు తగ్గించేందుకు ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు కూడా సామాన్యులకు కొంత ఊరటనిచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. పలు రాష్ట్రాల్లో తక్కువ ధరలకే టమాటాలు అందిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ తక్కువ ధరకే టమాటాలు కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. Paytm ఈ ఇనిషియేషన్ తీసుకుంది. Open Network for Digital Commerce (ONDC) భాగస్వామ్యంతో తక్కువ ధరకే టమాటాలు అందించనుంది. ప్రస్తుతానికి రిటైల్ మార్కెట్‌లలో కిలో టమాటా ధర కనీసం రూ.100గా ఉంది. మరి కొన్ని చోట్ల మాత్రం డిమాండ్ మరింత పెరిగిపోయి..కిలో ధర రూ.250 దాటింది. అందుకే...డిస్కౌంటెడ్ రేట్‌లో టమాటాలు అందించేందుకు పేటీఎమ్ ముందుకొచ్చింది. అయితే...అన్ని చోట్లా కాదు. ఢిల్లీ-NCR ప్రాంతాల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. పేటీఎమ్‌లో కిలో టమాటా ధర రూ.70గా నిర్ణయించారు. అంటే...ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పుడు రూ.70కే కిలో టమాటాలు కొనుగోలు చేసుకోవచ్చు. 


కండీషన్స్ అప్లై..


కానీ ఇక్కడో కండీషన్ ఉంది. ఓ వ్యక్తి కేవలం రెండు కిలోల టమాటాలు మాత్రమే కొనుగోలు చేయడానికి వీలుంటుంది. కేంద్రప్రభుత్వంతో పాటు కోఆపరేటివ్ సొసైటీలు, National Cooperative Consumers Federation(NCCF) కూడా టమాటాలను తక్కువ ధరలకు విక్రయిస్తున్నాయి. ఢిల్లీ, NCR ప్రాంతాల్లో మొబైల్ స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నాయి. ONDC ఈ వారం నుంచే టమాటాలు విక్రయించేందుకు ప్లాన్ చేసుకుంది. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, ఫరియాదాబాద్ ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే ధరల దడ నుంచి తప్పించుకున్నారు. గతంలో రూ.90కి కిలో అమ్మగా...ఇప్పుడు రూ.70కే విక్రయిస్తున్నారు. పేటీఎమ్‌లో టమాటాలు ఆర్డర్ చేయగానే...వెంటనే గంటలో ఇంటికి వచ్చేయవు. వాటికీ వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఆర్డర్ చేసిన తరవాత 24 గంటలకు మీ ఇంటికి వస్తాయి. అంటే...కచ్చితంగా ఒక రోజు పాటు ఆగాల్సిందే.


రెస్టారెంట్‌లలో నో టమాటా..


టమాటా ధరలకు భయపడి ప్రముఖ ఫుడ్ చెయిన్ సంస్థలు తమ ఉత్పత్తుల్లో టమాటాలు వాడడం నిలిపివేశాయి. రెండు వారాల నుంచి దేశంలోని చాలా ప్రాంతాల్లో మెక్‌ డొనాల్డ్స్‌ పిజ్జాల్లో టమాట ముక్కలు వేయడం లేదు. తాజాగా ఈ జాబితాలోకి సబ్‌వే చేరింది. భారత్ లోని చాలా సబ్‌వే అవుట్లెట్లలో టామాటా వినియోగం ఆపేశారు. ఢిల్లీ ఎయిర్ పో‌ర్ట్‌లోని సబ్‌వే ఔట్‌లెట్ టమాటలు వినియోగించడం లేదంటూ డిస్‌ప్లే చేసింది. వీలైనంత వేగంగా  టమాటా ఉత్పత్తులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఎన్ని బ్రాంచుల్లో ఈ పరిస్థితి ఎలా ఉందో స్పష్టమైన వివరాలు లేవు. భారత దేశం అంతటా కొన్ని ఔట్లెట్లలో అందిస్తున్నా ఢిల్లీలోని రెండు, ఉత్తరప్రదేశ్ లో ఒకటి, చెన్నైలో ఒకటి టమాటాలను ఉపయోగించడం లేదని సబ్ వే ఉద్యోగి ఒకరు తెలిపారు. రెండు వారాల క్రితం దేశంలోని చాలా ప్రాంతాల్లో మెక్‌ డొనాల్డ్స్‌ పిజ్జాల్లో టమాట ముక్కలు వేయడం లేదు. పెరిగిన ధరలతో ఇలా చేయడం లేదని.. తమ నాణ్యతా ప్రమాణాలకు తగిన టమాట (Tomato Price) సరఫరా లేకపోవడమే ఇందుకు కారణమని రెస్టారెంటు చెబుతోంది. 


Also Read: Hyderabad Woman: డిప్రెషన్‌కు గురై అమెరికాలో రోడ్డునపడ్డ హైదరాబాద్ యువతి, సాయం చేయాలని జైశంకర్‌కు తల్లి లేఖ