Tomato Price Hike: వ్యవసాయం చేయడం అంటే చాలా రిస్కుతో కూడకున్న పని. అరుగాలం కష్టపడ్డా పంట చేతికి వస్తుందో లేదో తెలిదు. పంట చేతికి వచ్చినా కొన్నిసార్లు పూర్తిగా నష్టాల పాలవుతుంటారు. ముఖ్యంగా కూరగాయలు పండించే వాళ్లు అయితే లాభాలు పొందడం కంటే ఎక్కువ సార్లు నష్టపోయిన వాళ్లే ఉంటారు. కానీ కేవలం కూరగాయలు పండించి.. అది కూడా నెల రోజుల్లోనే కోటీశ్వరులుగా మారడం అంటే అతిశయోక్తి కాదు. కానీ టమాటాలు పండించిన ఇద్దరు రైతులు నెల రోజుల్లోనే కోటీశ్వరులుగా మారారు. ఎక్కడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


శుక్రవారం ఒక్కరోజే 18 లక్షల సంపాదన


పుణే జిల్లాకి చెందిన తుకారాం భాగోజీ గయాకర్ (Tukaram Bhagoji Gayakar) టమాటాలు పండించి జాక్‌పాట్ కొట్టాడు. ఉన్నట్టుండి వాటి ధర ఆకాశాన్నంటింది. ఇంకేముంది వెంటవెంటనే వాటిని తీసుకొచ్చి మార్కెట్‌లో పోశాడు. అన్నీ హాట్‌కేక్‌లా అమ్ముడుపోయాయి. నెల రోజుల్లో దాదాపు 13 వేల కేసుల టమాటాలు విక్రయించాడు. ఇలా రూ.1.5కోట్లు సంపాదించాడు తుకారామ్‌కి 18 ఎకరాల పొలం ఉంది. అందులో 12 ఎకరాల్లో టమాటానే పండించాడు. అందరిలా కాకుండా కాస్త భిన్నంగా వీటిని సాగు చేసింది తుకారామ్ కుటుంబం. ఏయే ఫర్టిలైజర్‌లు వాడాలి..? ఏ మందులు వాడితే పురుగు రాకుండా ఉంటుంది..? అని చిన్నపాటి రీసెర్చ్ చేసి మరీ సాగు చేశారు. అలా సాగు చేయగా వచ్చిన టమాటాలను మార్కెట్‌కి తరలించే ముందు క్రేట్స్‌లో (Tomato Crates) సర్దుతారు. రోజుకి ఒకటి చొప్పున అమ్మి రూ.2,100 సంపాదించారు. ఈ మధ్యే ఒకే రోజు అత్యధికంగా 900 క్రేట్‌ల టమాటాలు అమ్మేశారు. అలా ఒక్క రోజులోనే రూ.18 లక్షలు సంపాదించుకున్నారు. క్వాలిటీని బట్టి ఒక్కో కేస్ రూ.1000 నుంచి రూ.2,400 వరకూ పలుకుతోంది. ఈ ఒక్క రైతే కాదు. పుణేలో జున్నార్‌ ప్రాంతంలో టమాటాలు పండించిన రైతులు కూడా లక్షాధికారులు అయిపోయారు.


రోజకు 600 నుంచి 700 పెట్టెలు 


ఛత్తీస్ గఢ్ ధమ్ తరీ జిల్లాలోని బీరన్ గ్రామానికి చెందిన అరుణ్ సాహూ 150 ఎకరాల్లో టమాటా పంట వేశారు. ఇలా రోజుకు 600 నుంచి 700 పెట్టెలు విక్రయించారు. ఇలా కోటికి పైగా ఈనెల కాలంలోనే సంపాధించారు. సాహూ ఉన్నత చదువులు చదివినప్పటికీ.. వ్యవసాయంపై మక్కువతో ఈ రంగంలోకి దిగారు. ఒక్క నెల రోజుల్లోనే కోటికి పైగా సంపాధించారు.


ఢిల్లీ సబ్సిడీ.. 


దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండి పోతున్నాయి. ఇప్పట్లో తగ్గే అవకాశాలూ కనిపించడం లేదు. అందుకే ప్రభుత్వాలో జోక్యం చేసుకుని తక్కువ ధరలకు టమాటాలు విక్రయిస్తున్నాయి. ఇప్పటికే చెన్నైలో పలు చోట్ల రేషన్‌ దుకాణాల్లో టమాటాలు తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇప్పుడు ఢిల్లీలోనూ టమాటా ధరలు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో నోయిడా, లఖ్‌నవూ, కాన్‌పూర్, వారణాసి,పట్నా, ముజఫర్‌పూర్‌ ప్రాంతాల్లో కిలో టమాటా రూ.80కే విక్రయించనుంది. దేశంలో దాదాపు 500 కేంద్రాల్లో ధరల స్థితిగతుల్ని తెలుసుకున్నాక..ఈ నిర్ణయం తీసుకున్నట్టు National Cooperative Consumers' Federation of India అధికారులు వెల్లడించారు. ఆదివారం నుంచే ధరలు అమల్లోకి వచ్చాయి.