This mysterious Indian island only exists for 30 minutes daily and then disappears: సుముద్ర ప్రాంతాల్లో అనేక దీవులు ఉంటాయి. వాటిలో కొన్ని ప్రత్యేకమైనవి. అలాంటి వాటిలో ఒటి కొంకణ్ తీరప్రాంతంలో దాగి ఉన్న సీగల్ ద్వీపం. తక్కువ ఆటుపోట్ల సమయంలో 30 నిమిషాలు మాత్రమే పైకి కనిపింంచడం ఈ ద్వీపం ప్రత్యేకత. ప్రకృతి ప్రేమికులను, సాహసోపేతమైన పర్యాటకులకు, పక్షుల్ని అధ్యయనం చేసే వారికి ఈ దీవి ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని దేవ్‌బాగ్ బీచ్ సమీపంలో ఉంది ఈ సీగల్ ద్వీపం. ఈ దీవికి ఉన్న ప్రత్యేకత కారణంగా 'మినీ థాయిలాండ్' అనే పేరుతోనూ పిలుస్తున్నారు.
సీగల్ ద్వీపం ప్రతిరోజూ అరగంట పాటు సముద్రం నుండి బయటకు కనిిపపిస్తుంందది. ఇది భారతదేశంలో అత్యంత సుందరమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి . అలలు తగ్గినప్పుడు సుందరమైన ఇసుక ప్రాంతం కనిపిస్తుంది. ఈ ద్వీపానికి అనేక పక్షి జాతులు గుంపులుగా వస్తాయి. అందుకే దానికి సీగల్ ద్వీపం అని పేరు పెట్టారు. సీగల్ పక్షులు ఎక్కువగా వస్తాయి. అందుకే ఈ ద్వీపం పక్షి వీక్షకులకు మరింత ప్రత్యేకమైనది. సీగల్స్ కాకుండా కింగ్‌ఫిషర్ పక్షులు కూడా వస్తాయి. సీగల్ ద్వీపాన్ని దాని సహజ పరిసరాలు మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. ఈ ద్వీపం ప్రశాంతమైన విశ్రాంతిని అందిస్తుంది. స్వచ్చంగా కనిపించే ఈ దివీలో అరగంట ఉన్నా.. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
Also Read: అది అడవిలో జంటలుగా గడిపాల్సిన బిగ్ బాస్ షో - అక్కడో ఘోరం జరిగిపోయింది - ఇప్పుడిదే వైరల్ వీడియో
సీగల్ ద్వీపం కనిపించే ఖచ్చితమైన సమయం ఏమీ ఉండదు. ప్రతిరోజూ మారుతూ ఉంటుంది, కాబట్టి సందర్శకులు ద్వీపంలోకి అడుగు పెట్టే అరుదైన అవకాశాన్ని కోల్పోకుండా చూసుకోవడానికి ప్రత్యేకంగా ప్రణాళిక వేసుకోవాలి. ద్వీపం సముద్రం నుండి బయటకు రావడాన్ని చూడటం ఒక అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ అవుతుంది. అసాధారణ ప్రదేశాలను అన్వేషించాలనుకునే వారికి సీగల్ ద్వీపం ఒక అద్భుతమైన ప్లేస్ అనుకోవచ్చు.