executes man with nitrogen gas:  ఉరిశిక్షల అమలుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఉరిశిక్ష అమలు చేయడం  ఘోరమని.. అలా చేయకూడదని ఎన్నో ఉద్యమాలు కూడా జరిగాయి. అమెరికాలోని యాభై రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలు ఉరిశిక్షను రద్దు చేసుకున్నాయి. జీవిత కాల జైలు శిక్షే అక్కడ తుది శిక్ష. కానీ అలబామా రాష్ట్రంలో ఉరి శిక్షలు అమల్లో ఉన్నాయి. తాజాగా అక్కడో సీరియల్ రేపిస్ట్, కిల్లర్ ను పోలీసులు ఉరి తీశారు.

ఉరి తీయడం అంటే భారత్ లో ఒకే ఆప్షన్ ఉంటుంది.  తాడుతో ఉరి వేయడం. కానీ అమెరికాలో మరణశిక్షలు అమలు చేస్తారు. ఉరి తీయడం అనేది చాలా అరుదు. కుర్చీలో కూర్చోబెట్టి కరెంట్ షాక్ ఇచ్చి చంపేయడం.   బూడితగా మార్చేయడం. ప్రాణాలు తీసే ఇంజక్షన్లు ఇవ్వడం  అలాగే ముఖాన్ని కవర్ లో పెట్టి గాలి ఆడకుండా చేసి చంపేయడం వంటి శిక్షలు అమలు చేస్తూంటారు. ఇవి అత్యంత ఘోరమని అనుకున్నా సరే వారు చేయాలనుకున్నది చేస్తారు.. చేశారు కూడా. 

1991లో 41 ఏళ్ల పౌలిన్ బ్రౌన్‌ను అత్యాచారం చేసి చంపిన కేసులో   52 ఏళ్ల డెమెట్రియస్ ఫ్రేజియర్  దోషిగా తేలాడు. ఈ సంవత్సరం అలబామాలో  మొదటి ఉరిశిక్ష. కొత్త ఏడాదిలో 2025లో USలో మూడవది.  టెక్సాస్‌లో బుధవారం ,  దక్షిణ కరోలినాలో గత శుక్రవారం ప్రాణాంతక ఇంజెక్షన్  ద్వారా మరణశిక్షను అమలు చేశారు. చనిపోయే ముందు ఫ్రేజియర్ .. తాను హత్య చేసిన మహిళ కుటుంబం గురించి మాట్లాడారు. మరోసారి ఎవరికీ అలాంటి పరిస్థితి రాకూడదని పశ్చాత్తాపం ప్రకటించారు. ఫ్రేజియర్ సీరియల్ రేపిస్ట్ గతంలో మిచిగాన్ లోనూ రేప్ , హత్యకు పాల్పడ్డారు. అక్కడడ శిక్ష అనుభవిస్తున్న సమయంలో అలబామా కేసులో శిక్ష విధించారు. అందుకే  మిచిగాన్ గవర్నర్  ఆయను ఉరి నుంచి కాపాడేందుకు తమ రాష్ట్రంలో గతంలో జీవిత ఖైదు అనుభవించడానికి  పంపించాలని కోరారు. కానీ అలబామా రాష్ట్రం అంగీకరించలేదు.      

ఫ్రేజియర్ ను మరణశిక్ష నుంచి కాపాడేందుకు ఉద్యమకారులు చాలా ప్రయత్నాలు చేశారు. మిచిగాన్‌లో మరణశిక్ష లేదు.అందుకే అక్కడి ఖైదీ కాబట్టి అక్కడికి అప్పగించాలని ఉద్యమ చేశారు. అతనికి క్షమాభిక్ష కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఫెడరల్ జడ్జి ద్వారా ప్రయత్నించారు.కానీ ప్రయోజనం లేకపోయింది. ఎక్కడా ఊరట లభించలేదు. డొనాల్డ్ ట్రంప్ కూడా.. మరణశిక్షల విషయంలో వ్యతిరేకంగా లేరు. ఈ కారణంగా ఫ్రేజియర్ కు శిక్ష తప్పలేదు. ఆయనకు మరణశిక్ష్ విధించిన జ్యూరీలో పన్నెండు మంది ఉంటే పది మంది డెత్ సెంటన్స్ విధించారు. అయితే ఫ్రేజియర్ నల్లజాతి మనిషి. జ్యూరీలో ఉన్న వారంతా తెల్లవాజాతి వారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.  

సాధారణంగా ఇలాంటి మరణశిక్షలు గల్ఫ్ దేశాల్లో అమలు చేస్తూంటారు. అయితే  అమెరికానూ అలాగే చేస్తున్నారు . అందుకే హక్కుల సంఘాలు  ఈ విధానాలను వ్యతిరేకిస్తున్నాయి.  

Also Read: అది అడవిలో జంటలుగా గడిపాల్సిన బిగ్ బాస్ షో - అక్కడో ఘోరం జరిగిపోయింది - ఇప్పుడిదే వైరల్ వీడియో