Indian Coast Guard: కొచ్చి సమీపంలో సముద్రంలో మునిగిపోతున్న ఒక విదేశీ నౌక నుంచి 21 మందిని భారత కోస్ట్ గార్డ్స్ రక్షించారు. మిగిలిన వారిని రక్షించేందుకు భారత తీర రక్షక దళం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. లిబియాకు చెందిన ఓడ శనివారం అకస్మాత్తుగా నీళ్లలో మునిగిపోయింది. లిబియా జెండాతో ఉన్న ఈ కంటైనర్ నౌక MSC ELSA 3, మే 23న విజింజం పోర్టు నుండి marine fuelతో బయలుదేరింది. మే 24న అది కొచ్చికి చేరుకోవాల్సి ఉంది.

Continues below advertisement


రెస్క్యూ ఆపరేషన్‌లో భారత తీర రక్షక దళం


మేసర్స్ ఎంఎస్సీ షిప్ మేనేజ్‌మెంట్ మే 24న మధ్యాహ్నం 1:25 గంటల ప్రాంతంలో కేరళ లోని కొచ్చి నుంచి దాదాపు 38 నాటికల్ మైళ్ల దక్షిణ పశ్చిమంలో తీవ్రమైన అలలు వస్తున్నాయని భారత అధికారులకు సమాచారం అందింది. భారత తీర రక్షక దళం మునిగిపోతున్న నౌకపై విమానం ద్వారా సహాయక చర్యలు చేపట్టింది. నౌకలో ఉన్న 24 మంది సిబ్బందిలో 9 మంది లైఫ్ బోట్లలో ఉన్నారు. మిగిలిన 15 మందిని మొదటగా రక్షించారు. 21 మందిని భారత కోస్ట్ గార్డ్స్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు..






 


భారత తీర రక్షక దళం నౌక నుంచి బయటకు వెళ్ళే మార్గాల దగ్గర అనేక లైఫ్ బోట్లను అందించి. డీజీ షిప్పింగ్ భారత తీర రక్షక దళంతో సమన్వయం చేసుకుని నౌక యజమానులు తమ నౌకకు తక్షణ సాయం అందించాలని కోరారు. దాంతో భారత కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగి మునిగిపోతున్న ఓడలోని 21 మందిని కాపాడింది. దాంతో భారీ ప్రాణనష్టం తప్పింది. 


లైబీరియాకు చెందిన కంటైనర్ నౌక MSC Elsa 3 కంటైనర్లలో సముద్ర ఇంధనాన్ని తరలిస్తోంది. ఈ నౌకలోని 24 మంది సిబ్బందిలో ఒకరు రష్యన్, మాస్టర్, 20 మంది ఫ్లిపినోలు, ఇద్దరు ఉక్రేనియా, ఒకరు జార్జియాకు చెందిన వారు పిటిఐ పేర్కొంది. 184 మీటర్ల పొడవున్న ఈ నౌక మే 23న (శుక్రవారం) విజింజం పోర్టులో బయలుదేరింది మే 24న కొచ్చి చేరుకోవాల్సి ఉండగా తీవ్రమైన అలలకు సముద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న భారత కోస్ట్ గార్డ్స్ ఆ ఓడలో ప్రయాణిస్తున్న వారిలో 21 మందిని కాపాడారు.


ప్రజలకు చేసిన సూచనలు


ఈ ప్రమాదంలో కొన్ని కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. కేరళ తీరంలో వస్తువులు తేలియాడే అవకాశం ఉందని కేరళ విపత్తు నిర్వహణ అధికార సంస్థ KSDMA ప్రజలను హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఆ వస్తువులను తాకడానికి, వాటి గురించి వెతకడానికి ప్రయత్నించకూడదని సూచించింది. సముద్ర తీరంలో కంటైనర్లు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.