Barasat Fire Accident: 


పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్‌ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు ధాటికి గోడలు ధ్వంసమయ్యాయి. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యల్లో జాప్యం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.