Tens of Naxalites are dying in the encounters : మావోయిస్టు లు లేదా నక్సలైట్స్ ఎవరైనా వారికి పెట్టని కోటల్లాంటి దండకారణ్యాల్లో జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో పిట్టల్లా రాలిపోతున్నారు. ఒకరు కాదు..ఇద్దరు కాదు మొత్తం పార్టీ నాయకత్వం అంతమైపోతోంది. తాజాగా అబూజ్ మడ్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో 32 మంది చనిపోయారు. దళంలో పనిచేసే అత్యున్నత నేతలు అందులో ఉన్నారు. ఇప్పటికే గత తొమ్మిది నెలల్లో రెండు వందల మందిని ఎన్ కౌంటర్ చేశారు. చాలా మంది లొంగిపోయారు. మరికొంత మందిని అరెస్టు చేశారు. మరి నక్సలిజం ఉంటుందా ?
నక్సలిజంపై ఉక్కుపాదం మోపుతున్న బలగాలు
2026 నాటికి దేశంలో నక్సలైట్లను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యాన్ని కేంద్రం పెట్టుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టడంతో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్ కౌంటర్లు కామన్ అయిపోయాయి. గత 9 నెలల్లో అనేక ఎదురు కాల్పుల ఘటనలు జరిగాయి. వీటిల్లో 202 మంది నక్సలైట్లు మరణించగా, 812 మంది నక్సలైట్లను అరెస్టు చేసినట్లుగా అేధికారిక లెక్కల్లో చూపించారు. వామపక్ష తీవ్రవాదంతో ప్రభావితమైన అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయాన్ని అందిస్తోంది. ప్రత్యేకంగా నిధులు కూడా ఇస్తున్నారు.
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
అవసాన దశలో నక్సలిజం
నక్సలిజం ప్రస్తుతం చివరి పోరాటంలో ఉంది. వారు ఎదురుదాడులు చేసే పరిస్థితుల్లో లేరు. 2024లో నక్సలైట్లపై భద్రతా బలగాలు పూర్తి ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి. ఇప్పటికే నాటికి వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్య 38కి తగ్గింది. నక్సల్స్ ప్రభావం తతగ్గడంతో ని మారుమూల ప్రాంతాలకు కూడా అభివృద్ధి పథకాలను తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఈ ప్రాంతాల్లో రోడ్డు, మొబైల్ కనెక్టివిటీకి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటివరకు 14,400 కిలోమీటర్ల రోడ్లు నిర్మించగా, దాదాపు 6000 మొబైల్ టవర్లు ఏర్పాటు చేశారు. మారుతున్న కాలంతో నక్సలిజం వైపు ఆకర్షితులయ్యేవారు కూడా తగ్గిపోతున్నారు.
అబుజ్ మాడ్ - దండకారణ్యంలో మావోల శకం ముగిసినట్లేనా ?
వృద్ధ నాయకత్వం - కొత్త క్యాడర్ లేదు - ఇక నక్సలిజానికి అంతమే!
ఒకప్పుడు నక్సలిజానికి చాలా క్రేజ్ ఉండేది. అన్యాయాలు, అక్రమాల్ని ఎదిరించడానికి తుపాకీ పట్టుకోవడమే మార్గమని అడవుల్లోకి వెళ్లేవారు. ఇప్పుడు అడవుల్లో ఉండే వారు కూడా నక్సలిజానికి వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో దశాబ్దాల కిందట ఉద్యమంలోకి వెళ్లిన వాళ్లు తప్ప కొత్త వాళ్లు ఎవరూ నక్సలైట్లలోకి చేరడం లేదు. రిక్రూట్మెంట్లు సాధ్యం కావడం లేదు. అప్పటి నాయకత్వం వృద్ధతరానికి మారింది. వారిని కాపాడుకోవడమే పెను భారంగా మారింది. ఓ వైపు ఆర్థిక పరమైన కట్టడి.. ఆయుధాలు అందకుండా చేసి బలగాలు పైచేయి సాధిస్తున్నాయి. సాంకేతిక కారణంగా నక్సలైట్లు బలగాలకు సులువుగా దొరికిపోతున్నారు. ఫలితం ఎన్ కౌంటర్లు చేసేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత యుద్ధం చివరి స్థాయికి వచ్చిందని మరికొద్ది రోజుల్లనే నక్సలిజంను చరిత్రలో కలిపేస్తామని కేంద్రం నమ్మకంగా ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే... అదేమి అసాధ్యం కాని ఎవరైనా అనుకుంటారు.