Chhattisgarh Encounter News: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పది మంది మావోయిస్టులు హతమయ్యారు. ఉదయం నుంచి రెండు వర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. కూంబింగ్‌కు వెళ్తున్న భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు కాల్పులు చేశారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.  

నవంబర్ 22న సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఆపరేషన్‌లో 10 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు హతమార్చాయని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి తెలిపారు. భద్రతా బలగాలు సాధించిన ఈ ఘనతపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. నక్సలిజం పట్ల జీరో టాలరెన్స్ విధానంపై తన ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. బస్తర్‌లో అభివృద్ధి, శాంతి భద్రతలు, పౌరుల భద్రతను తన ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ఆయన అన్నారు.

వాస్తవానికి ఒడిశా మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోకి నక్సలైట్లు ప్రవేశించినట్లు డీఆర్‌జీ బృందానికి ఒకరోజు ముందే సమాచారం అందింది. ఘటనా స్థలానికి డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్‌ బృందాలు బయలుదేరాయి.  ఈ క్రమంలోనే సుక్మా జిల్లా అడవుల్లో నక్సలైట్లతో భద్రతా బలగాలకు కాల్పులు జరిగాయి. సుక్మా జిల్లాలోని థానా భెజ్జి ప్రాంతంలోని కొరాజుగూడ, దంతేస్‌పురం, నాగారం, భండరపదర్‌లోని అడవులు ఘటన జరిగింది. ఘటనా స్థలంలో జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుంచి INSAS, AK-47, SLR ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 

Also Read: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు