Wanted Bride Posters : ఒకప్పుడు అమ్మాయిలకు పెళ్లి చేయడం కష్టమయ్యేది కానీ ఇప్పుడు అబ్బాయిలకు పెళ్లి కావడం కష్టమవుతోంది. పిల్ల దొరకడంలేదు. దీంతో ఏళ్ల తరబడి తనకు కాబోయే జోడి కోసం నిరీక్షించి.. నిరీక్షించి పెళ్లికాని ప్రసాద్‌లవుతున్నారు. ఇలా ఎంతో మందికి పెళ్లి కావడం లేదని.. తనకు కూడా కాదేమోనని కంగారు పడిన ఓ యువకుడు.. కొత్త ఆలోచన చేశాడు. ఊరి నిండా పోస్టర్లేశాడు.
ప్రేమ కోసం అబ్బాయిగా మారిన యుువతి- ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం
ఐదేళ్లుగా వెదుకుతున్న పిల్ల దొరకలేదట !
తమిళనాడులోని మధురైకు చెందిన జగన్ అనే యువకుడు వివాహం చేసుకోవాలని ఐదేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఒక్క సంబంధమూ కుదరడం లేదు. దీంతో ఆలస్యమైపోతోందని తనకి భార్య కావాలంటూ.. పోస్టర్ వేసి అక్కడక్కడా అతికించాడు. ఇది చూసిన జనాలు అవాక్కవుతున్నారు.
ఐ యామ్ వెరీ సారీ అంటూ ఐదు కిలోల బరువైన క్షమాపణ లేఖ- అక్క లెటర్ చూసి షాక్ అయిన తమ్ముడు
ఆలస్యం అవుతోందని పోస్టర్లు వేసి ఊరంతా అంటించిన జగన్
పోస్టర్లో తన క్వాలిఫికేషన్స్ కూడా రాసుకున్నాడు. జగన్ ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడట. నెలకు రూ. 40 వేల జీతం. తాను డిజైనర్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో.. తన పేరు, కులం, వృత్తి, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ వివరాలు, తన ఫొటో కూడా వచ్చేలా ఓ పోస్టర్‌ని తయారుచేసి తాను నివసించే ప్రాంతంలోనే కాకుండా.. మరికొన్ని ప్రాంతాల్లోనూ అంటించాడు. ఇప్పుడా పోస్టర్లు తమిళనాడులో వైరల్‌గా మారాయి. మధురైలో అందరూ జగన్ ప్రయత్నాల గురించి చర్చించుకుటున్నారు.
"మహా" రాజకీయ సంక్షోభంలో కీలక మలుపు - రెబల్ ఎమ్మెల్యేలకు మరింత గడువిచ్చిన సుప్రీంకోర్టు !
ఇప్పటికైనా దొరక్కపోతే పరిస్థితేంటి ?
సోషల్ మీడియాలో కూడా ఈ పోస్టర్ వైరల్‌గా మారింది. మరి జగన్ చేసిన ఈ ప్రయత్నం ఫలించి.. ఏ తండ్రి అయినా తమ కుమార్తెనివ్వడానికి ముందుకొస్తారో లేదోనని నెటిజన్లకు కూడా ఉత్కంఠగానే ఉంది. ఈ ప్రయత్నం కూడా ఫెయిలయితే జగన్‌కు పెళ్లి కాదని కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే జగన్ చెప్పుకున్నారు.. ఇతర యువకులు చెప్పుకోవడం లేదు.. అదీ తేడా అని చాలా మంది నిట్టూరుస్తున్నారు. నీకు ఇంకా పెళ్లి కాలేదా అని ఆశ్చర్యపోతే.. పెళ్లి కాలేదు కాదు.. చేసుకోలేదు కవర్ చేసుకునే వాళ్ల బాధలు అలాగే ఉంటాయని సెటైర్లు మాత్రం వేస్తున్నారు.