ప్రభుత్వ ఉద్యోగులకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసు వేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎం సుబ్రమణియన్ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెంటనే రూపొందించాలని, రూల్స్ ఫాలో కానీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ సుబ్రమణియన్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆఫీసు సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు కొందరు అదే పనిగా ఫోన్‌లో మునిగిపోవడాన్ని పని పట్ల నిబద్ధత లేకపోవడంగా పరిగణిస్తామని కోర్టు తెలిపింది.
తిరుచిరాపల్లిలోని ఓ ఆరోగ్య కార్యశాలలో పనిచేసే సుపరింటెండెంట్.. ఆఫీసు సమయంలో తరుచుగా తన ఫోన్‌తో వీడియోలు తీయడం వివాదాస్పదమైంది. ప్రభుత్వం అతడ్ని సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ ఆ ఉద్యోగి హైకోర్టుని ఆశ్రయించాడు. అయితే హైకోర్టు మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులందరికీ షాక్ ఇచ్చింది.
Also Read: Modi on Kashmir Files: 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై మోదీ కీలక వ్యాఖ్యలు- ఏమన్నారో తెలుసా?
Also Read: Hijab Ban Verdict: చదువుకోండి ఫస్ట్- మిమ్మల్ని స్కూల్‌కు పంపేది చదువుకోవడానికి: భాజపా