Hijab Ban Verdict: చదువుకోండి ఫస్ట్- మిమ్మల్ని స్కూల్‌కు పంపేది చదువుకోవడానికి: భాజపా

Hijab Ban Verdict: హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును భాజపా స్వాగతించింది. అయితే ఇది బాలికల స్వేచ్ఛను హరిస్తుందని మెహబూబా ముఫ్తీ అన్నారు.

Continues below advertisement

Hijab Ban Verdict: హిజాబ్‌ తప్పనిసరి కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాజకీయ పార్టీల నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. భాజపా నేతలు ఈ తీర్పును స్వాగతించగా, వివిధ ముస్లిం నేతలు కోర్టు వ్యాఖ్యలు బాధించాయని వ్యాఖ్యానించారు.

Continues below advertisement

స్వాగతిస్తున్నాం

కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.

న్యాయస్థానం నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. రాష్ట్రం, దేశం పురోగమించాలి.. హైకోర్టు ఆదేశాలను అంగీకరించి ప్రతిఒక్కరూ శాంతియుతంగా నడవాలి. విద్యార్థుల ప్రాథమిక పని చదువుకోవడం. కనుక ఇలాంటివన్నీ పక్కన పెట్టి ముందు చదువుకోండి.                                                   - ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి

ప్రహ్లాద్ జోషితో పాటు, భాజపా నేతలు అశ్విని ఉపాధ్యాయ్, ఎంపీ తేజస్వీ సూర్య, కర్ణాటక మంత్రి కే సుధాకర్ కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. హిజాబ్ నిషేధం వల్ల బాలికలకు చదువుకునేందుకు ఇంకా ఎక్కువ అవకాశాలు కలుగుతాయన్నారు.

నిరాశ చెందాం

హిజాబ్‌ను నిషేధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు తీవ్రంగా నిరాశపరిచింది. ఓ పక్క మహిళా సాధికారత అంటూ మనమే మాట్లడతాం.. మరోపక్క వాళ్లకు నచ్చింది చేసే హక్కును కాలరాస్తున్నాం. ఇది కేవలం మతానికి సంబంధించినది కాదు స్వేచ్ఛకు సంబంధించిన విషయం.                                                          -  మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం

ఫిబ్రవరి 10 నుంచి 25వ తేదీ మధ్య దాదాపు 11 రోజుల పాటు హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు విచారణ చేసింది. అనంతరం ఈరోజు హిజాబ్ బ్యాన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

Also Read: Modi on Kashmir Files: 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై మోదీ కీలక వ్యాఖ్యలు- ఏమన్నారో తెలుసా?

Continues below advertisement
Sponsored Links by Taboola