Coimbatore DIG Suicide:
తమిళనాడులో డీఐజీ ఆత్మహత్య
తమిళనాడులోని కోయంబత్తూర్ డీఐజీ సీ విజయ్ కుమార్ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు విచారణలో తేల్చారు. చాలా రోజులుగా ఆయన డిప్రెషన్ తగ్గించుకోడానికి మందులు వాడుతున్నారని వైద్యులు వెల్లడించారు. డీఐజీ పర్సనల్ డాక్టర్‌తో మాట్లాడిన అడిషనల్ డీజీపీ కీలక వివరాలు తెలిపారు.
"డీఐజీ విజయ్ కుమార్ చాలా ఏళ్లుగా డిప్రెషన్‌తో బాధ పడుతున్నారు. చాలా రోజులుగా మందులు వాడుతున్నారు. ఆయనకు ట్రీట్‌మెంట్ అందించిన డాక్టర్‌తో నేను పర్సనల్‌గా మాట్లాడాను. నాలుగు రోజుల క్రితమే తనకు ఒత్తిడి మరింత పెరిగిపోతోందని DIG చెప్పినట్టు డాక్టర్ వెల్లడించారు. వెంటనే డాక్టర్ మందులు మార్చి ఇచ్చారు. ఆయన కుటుంబం కోయంబత్తూర్‌కి వచ్చి నాలుగు రోజులవుతోంది. అందరూ ఊహిస్తున్నట్టుగా కుటుంబ కలహాలు ఏమీ లేవు. వర్క్ ప్రెజర్ కూడా లేదు. కేవలం ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అనవసరంగా దీన్ని రాజకీయం చేయొద్దు. విజయ్ చాలా డెడికేటెడ్‌గా పని చేసే వారు. "
- అరుణ్, అడిషనల్ డీజీపీ
అయితే తాను డిప్రెషన్‌కి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్టు ఉన్నతాధికారులకు చెప్పలేదు డీఐజీ విజయ్ కుమార్. ఆయన చనిపోయిన తరవాతే ఇదంతా తెలిసిందని వెల్లడించారు. భద్రతా కారణాలతో గన్ క్యారీ చేస్తున్న ఆయన ఆ గన్‌తో కాల్చుకుని చనిపోయారు.