దేశంలో పారిశుద్ధ్యాన్ని మరింత పెంచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. జాతీయ స్థాయిలో పారిశుద్ధ్య నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నిలిచింది. వరుసగా 5వ ఏడాది స్వచ్ఛ్ సర్వేక్షన్ 2021 అవార్డును ఇండోర్ కైవసం చేసుకుంది. గుజరాత్ లోని సూరత్ రెండో స్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్‌కి సైతం స్వచ్ఛ భార‌త్ అవార్డుల పంట‌ పండింది. స్వచ్ఛ్ స‌ర్వేక్షణ్‌లో విజ‌య‌వాడ‌కు మూడో ర్యాంక్‌ రాగా, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్‌ ఈ అవార్డుని అందుకున్నారు. గత నాలుగో స్థానంలో ఉన్న విజయవాడ ఈ సారి ఓ ర్యాంకు ఎగబాకింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రోత్సాహంతో అవార్డు సాధ్యమైందని విజయవాడ మేయర్, అధికారులు అన్నారు. 






స‌ఫాయి మిత్ర చాలెంజ్‌లో నెల్లూరు కార్పొరేష‌న్‌కు మొద‌టి అవార్డు అందుకుంది. నెల్లూరు కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ దినేష్‌ ఈ అవార్డుని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప‌ది కోట్ల రూపాయల ప్రోత్సాహ‌కం ప్రక‌టించింది. 5 ల‌క్షలోపు జ‌నాభా కలిగిన మున్సిపాలిటీ కేటగిరిలో పుంగ‌నూరుకు స్వచ్ఛ స‌ర్వేక్షణ్ అవార్డు లభించింది. మరోవైపు తిరుప‌తి కార్పొరేష‌న్ కు గార్బేజ్ ఫ్రీ సిటీ (చెత్త లేని నగరం)తో పాటు త్రీ స్టార్ రేటింగ్, సఫాయి మిత్ర అవార్డులు, సిటిజన్ ఫీడ్ బ్యాక్ విభాగాలలో అవార్డులో సొంతం చేసుకుంది. రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహకం కైవసం చేసుకుంది.
Also Read: Kannababu: టీడీపీ నేతలే వ్యక్తిగత దాడులు ప్రారంభించారు... బాబాయ్ గొడ్డలి నినాదాలు చేశారు... అసెంబ్లీ వివాదంపై మంత్రి కన్నబాబు


క‌డ‌ప కార్పొరేష‌న్‌కు, విశాఖ, విజ‌య‌వాడ‌ కార్పొరేష‌న్‌కు గార్బేజ్ ఫ్రీ సిటీ అవార్డులు ప్రదానం చేశారు. నెల్లూరు కార్పొరేష‌న్‌కు స‌ఫాయి మిత్ర చాలెంజ్ అవార్డు లభించింది. అత్యంత పరిశుభ్రంగా ఉన్న గంగా నగరంగా వారణాసికి అవార్డు దక్కింది. దేశంలో అతి పరిశుభ్రమైన రాష్ట్రంగా ఛత్తీస్ గఢ్ నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఆ రాష్ట్రం క్లీనెస్ట్ స్టేట్‌గా అవార్డు దక్కించుకుంది. రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ స్వచ్ఛ స‌ర్వేక్షన్ అవార్డుల‌ను నేడు ప్రదానం చేశారు. మనుషులతో డ్రైనేజీ పనులు చేయించకూడదని, యంత్రాలతోనే ఇలాంటి పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 


ప్రధాని నరేంద్ర మోదీ 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, స్వచ్ఛ్ సర్వేక్షన్ అవార్డును ప్రదానం చేస్తున్నారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ దేశంలోని మొత్తం 4,242 నగరాలు, పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డులు, 92 గంగా పరివాహక ప్రాంతాల్లోని పట్టణాల్లో సర్వే నిర్వహించింది. పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయా రాష్ట్రాలు, నగరాలు, పట్టణాలు, కార్పొరేషన్లకు స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డులను 2016 నుంచి కేంద్రం అందిస్తోంది.
Also Read:ఆడపడుచులను కించ పరచడం అరాచకమే.. ఏపీ అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన


క్లీనెస్ట్ సిటీస్ టాప్ 10..
1. ఇండోర్
2. సూరత్
3. విజయవాడ
4. నవీ ముంబై
5. పుణే
6. రాయ్‌పూర్
7. భోపాల్
8. వడోదర
9. విశాఖపట్నం
10. అహ్మదాబాద్


Also Read: తిరుపతిలో వరద బీభత్సం... ప్రమాదకరంగా రాయలచెరువు కట్ట... అప్రమత్తంగా ఉండాలని అధికారుల దండోరా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి