Breaking  News : ఉత్తరప్రదేశ్ లోని బాగ్‌పత్‌ లో నిర్వహించిన లడ్డూ మహోత్సవంలో విషాదం చోటుచేసుకుంది. వేదిక కూలి ఏడుగురు మృతి చెందగా, దాదాపు 50 మంది గాయపడ్డట్టు సమాచారం. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు భక్తులు 'ప్రధాన స్తంభం' వద్ద లడ్డూలు సమర్పిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బరౌత్‌లోని జైన సంఘం 'లడ్డూ మహోత్సవ్'ను నిర్వహించింది. ఈ క్రమంలో ఆదినాథునికి లడ్డూలు సమర్పించేందుకు వందలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. ఇంతలోనే భక్తుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక చెక్క నిర్మాణం బరువు ఆపలేక అకస్మాత్తుగా కూలిపోయింది.





ప్రమాదం గురించి తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిని వారికి కావల్సిన చికిత్స అందించాలన్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆయన కోరుకుంటున్నట్టు సీఎం కార్యాలయం తెలిపింది.





శ్రీ దిగంబర్ జైన్ డిగ్రీ కళాశాల మైదానంలో మతపరమైన కార్యక్రమం లడ్డూ నిర్వాణ మహోత్సవం కోసం ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా దాదాపు 65 అడుగుల ఎత్తులో చెక్కలతో ఓ వేదికను నిర్మించారు. దానిపై 4,5 అడుగుల దేవుడి విగ్రహాన్ని ఉంచారు. దేవున్ని సందర్శించి, మొక్కులు తీర్చుకునేందుకు అనువుగా భక్తుల కోసం చెక్కలతో మెట్లను నిర్మించారు. అయితే ఉత్సవానికి పెద్ద మొత్తంలో వచ్చిన భక్తులు ఆ మెట్లు ఎక్కుతుండగా.. ఆ బరువు ను ఆపలేక మెట్లు విరిగిపోయాయి. అలా స్టేజీ మొత్తం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో కొందరు భక్తులు కింద పడి ప్రాణాలు కోల్పోగా, మరి కొందరు మాత్రం తమ ప్రాణాలు కాపాడుకోవాడినిక పరుగులు తీశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.






Also Read : Gold-Silver Prices Today 28 Jan: వరుసగా రెండోరోజూ తగ్గిన నగల రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ