కేంద్ర ప్రభుత్వ శాఖలు/విభాగాల్లో ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్(సీజీఎల్ఈ)-2021 తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమీషన్(ఎస్‌ఎస్‌సీ) మార్చి 17న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను నాలుగు జాబితాల్లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచింది.


మొదటి జాబితాలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు 524 మంది అభ్యర్థులు, రెండో జాబితాలో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు 110 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇక మూడో జాబితాలో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు 648 మంది అభ్యర్థులు, నాలుగో జాబితాలో మిగతా పోస్టులకు 6249 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మొత్తం 7621 పోస్టులకుగాను 7541 మంది అభ్యర్థులను  ఎస్‌ఎస్‌సీ ఎంపికచేసింది. వివిధ కారణాల వల్ల 25 మంది అభ్యర్థుల ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పెండింగ్‌లో ఉంచింది.


SSC CGLE - 2021 తుది ఫలితాలను ఇలా చూసుకోండి..


Step 1: అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - ssc.nic.in.


Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'Results' టాబ్ మీద క్లిక్ చేయాలి.


Step 3: క్లిక్ చేయగానే వచ్చే పేజీలో 'Combined Graduate Level Examination (Final Result), 2021' ఫలితాలకు సంబంధించిన లింక్స్ కనిపిస్తాయి. మొత్తం 4 జాబితాల్లో అభ్యర్థుల ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచింది.


Step 4: ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంటుంది. 


Step 5: అభ్యర్థులు పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని, ఫలితాలు చూసుకోవచ్చు. 


Step 6: ఫలితాలు చూసుకోవడానికి కంప్యూటర్ కీబోర్డులో "Ctrl + F" కాంబినేషన్‌లో క్లిక్ చేసి సెర్చ్ బాక్సులో హాల్‌టికెట్ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. నెంబరు కనిపించనివారు ఎంపికకానట్లే.


List -1: AAOs Posts


List-2: JSO Posts


List-3: Statistical Investigator (SI) Posts  


List-4 Other than AAOs, JSO & SI Posts 


కటాఫ్ మార్కులు ఇలా..



సీజీఎల్-2021 ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఏఏవో, అసిస్టెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ జేఎస్‌వో, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ఇన్‌స్పెక్టర్(సీజీఎస్‌టీ, సెంట్రల్ ఎక్సైజ్), అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్ట్స్, డివిజినల్ అకౌంటెంట్, స్టాటిస్టిటికల్ ఇన్వెస్టిగేటర్, జూనియర్ స్టాటిస్టిటికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేస్తోంది. టైర్-3లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌సీ జనవరిలో స్కిల్ టెస్ట్ (కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్/ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్), సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను వెబ్‌సైట్‌లో అభ్యర్థులు చూసుకోవచ్చు.


* కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్(సీజీఎల్‌ఈ)-2021 టైర్-3 ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతేడాది డిసెంబరు 20న విడుదల చేసిన సంగతి తెలిసిందే. 'టైర్‌-3'లో ఎంపికైన అభ్యర్థులకు జనవరి 4, 5 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన, నైపుణ్య పరీక్ష (కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్/డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్)లు నిర్వహించిన తాజాగా తుది ఫలితాలను ఎస్‌ఎస్‌సీ విడుదల చేసింది. మొత్తం 34,992 మంది అభ్యర్థులకు స్కిల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించిన తర్వాత 7541 మంది అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపికచేసింది.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...