Obesity Related News: ఒబెసిటీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేపట్టిన ప్రధానమంత్రి చర్యలను శివసేన ఎంపీ మిలింద దేవరా. ఇప్పుడు పిల్లలను టార్గెట్ చేస్తూ ఎక్కువ షుగర్, ఫ్యాట్‌ ఉన్న ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ యాడ్స్‌ను కూడా నిషేధించాలని సూచించారు. ఇలాంటి ఉత్పత్తులపై ఎక్కువ పన్నులు వేయాలనిఅభ్యర్థించారు. 


కుటుంబ సంక్షేమం ఆరోగ్యంపై జరిగిన చర్చల్లో భాగంగా మిలిందా మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. ఆమెరికా టెక్నాలజీ ఇండియాకు రావడం అనేది సమస్య కాదని కానీ అక్కడ ఒబెసిటీ లైఫ్‌ స్టైల్‌ను దిగుమతి మాత్రం ప్రమాదకమరని ఆందోళన వ్యక్తం చేశారు. 


" అమెరికాలో ఇప్పుడు స్థూలకాయం ఆరోగ్య సమస్యగా మాత్రమే కాదు ఆర్థిక సమస్య అని నేను భావిస్తున్నాను. అమెరికా నుంచి ఇండియా ఏం నేర్చుకుంటో నేను కొంత సమాచారాన్ని షేర్ చేయాలనుకుంటున్నాని." అని అన్నారు. 


"నేడు అమెరికాలో 42శాతం అడల్ట్స్‌, 20 శాతం చిన్నారులు ఒబెసిటీతో బాధపడుతున్నారు. ఇది గత రెండు దశాబ్ధాల్లోనే 30 శాతం పెరిగింది. బబెసిటీ సంబంధిత జబ్బులపై అమెరికా ఏటా 1.4 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది.ఇది జీడీపీలో ఏడు శాతం. ప్రతి మరణించే ముగ్గురిలో ఒకరు ఒబెసిటీ కారణంతో చనిపోతున్నారు. మనం జాగ్రత్త పడాలని అమెరికా ఇస్తున్న సందేశం" అని లెక్కలు వివరించారు. 


ప్రధానమంత్రి కలలుగంటున్న ఊబకాయరహిత సమాజం చూడాలంటే చాలా కఠిన చర్యలు తీసుకోవాలని మిలిందా సూచించారు.  


మన దేశంలో కూడా ఒబెసిటీ కేసులు పెరుగుతున్నట్టు మిలిందా వివరించారు. గత ఐదేళ్లుగా పురుషుల్లో 23 శాతం వరకు ఒబెసిటీ పెరిగినట్ట తెలిపారు. " ప్రైమరీ హెల్త్ సర్వే డేటా ప్రకారం ఇండియాలో పురుషుల్లో ఒబెసిటీ 19 శాతం నుంచి 23 శాతానికి పెరిగింది. స్త్రీలలో 21 శాతం నుంచి 23 శాతానికి పెరిగింది. ఇప్పుడు ప్రజలు కూడా మాల్‌న్యూట్రీషియన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈవిషయంలో ప్రభుత్వం చూపించిన చొరవ మెచ్చుకోదగింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు పౌష్టికాహారం కొరతో బాధపడుతున్నారు. అదై టైంలో పట్టణప్రాంతాల్లో పిల్లలు ఒబెసిటీతో బాధపడుతున్నారు. గత పదేళ్లలో అధిక బరువు కలిగిన వాళ్లు సంఖ్య 60 శాతం పెరిగింది. " అని ఆందోళన వ్యక్తం చేశారు. 


ఈ స్థూలకాయం వల్ల వచ్చే వ్యాధులపై చేసే ఖర్చు 2030 నాటికి భారత్‌ జీడీపీలో 1.6 శాతం ఉంటుంది. అంటే ఏటా 7 లక్షల కోట్ల రూపాయలు దీని కోసం ఖర్చు పెట్టాలి. ఊబకాయ సమస్య కేవలం ఆరోగ్య సమస్యే కాదు అతి పెద్ద ఆర్థిక సవాల్‌. ఇప్పుడే దీనికి అ‌డ్డుకట్ట వేయకపోతే దేశాభివృద్ధినే ఆటంకంగా మారుతుంది. ఒబెసిటీ వల్ల వచ్చే వ్యాధులపై పెట్టే ఖర్చు పెరగడంతోపాటు ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది." అని ఆందోళన వ్యక్తం చేశారు. 


కొన్ని సర్వేల ప్రకారం ఐదేళ్ల లోపు పిల్లలు ఒబెసిటితో బాధపడుతుంటే వాళ్లను ఆ సమస్య భవిష్యత్‌లో కూడా వేధించే ప్రమాదం ఉంది. అందుకే స్థూలకాయ సమస్యను చిన్నతనం నుంచే కంట్రోల్ చేయాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జంక్‌ఫుడ్‌కు, సాఫ్ట్‌ డ్రింక్స్‌కు దూరంగా ఉంటూ హెల్తీ లైఫ్‌స్టైల్‌ అనుసరిస్తే స్థూలకాయం రాదని చెబుతున్నారు.