బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఆరేళ్ల బాలుడు షాక్ ఇచ్చాడు. ప్రభుత్వం పాఠశాలలో చదువు సరిగా చెప్పడం లేదని.. తనకు ప్రైవేట్ పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించాలని  రిక్వస్ట్ చేశారు. ఆ బాలుడి మాటలు విన్న నితీష్‌కుమార్ కాసేపు ఆశ్చర్యానికి లోనయ్యారు. 


నలంద జిల్లా హర్నాట్ బ్లాక్ పరిధిలోని సీఎం స్వగ్రామం కళ్యాణ్‌బిఘలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైర్‌లగా మారింది. 


అందులో ఆ బాలుడు ఏమన్నాడంటే... "దయచేసి నా చదువుకు మద్దతు ఇవ్వండి" సార్! నా మొర వినండి...దయచేసి నా చదువుకు మద్దతు ఇవ్వండి. నన్ను పెంచుతున్న వ్యక్తికి నా చదువు పట్ల శ్రద్ధ లేదు. నాకు సాయం చేయాలనే ఇష్టం లేదు. నా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను ఎలా అందించాలో ఉపాధ్యాయులకు తెలియడం లేదు' అని సోను సీఎంకు తెలిపారు.






తాను చదువుతున్న స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లేదని, అందుకే ప్రైవేట్‌ పాఠశాలలో చేర్పించాలని కోరా.


పాఠశాల విద్యార్థి బాధను విన్న సీఎం నితీష్.. వెంటనే అతనితోపాటు ఉన్న అధికారిలో ఒకరిని పిలిచి బాలుడి చదువుకు అవసరమైన ఏర్పాట్లు చేయమని కోరారు. నాణ్యమైన విద్యనందించేందుకు సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చారని బాలుడు తెలిపాడు.