ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జసోవర్ గ్రామానికి చెందిన ఒక టీవీ మెకానిక్ కూతురు సానియా మీర్జా. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలో  పాస్ అయ్యింది. భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా సెలెక్ట్ అయ్యింది. దేశంలోనే మొదటి ముస్లిం యువతిగా రికార్డు బద్దలు కొట్టింది. అంతేకాదు ఉత్తర్ ప్రదేశ్ నుంచి తొలి  ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ కావడం విశేషం. సానియా యూపీ రాష్ట్రానికే కాదు దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకొచ్చింది. 


సానియా మీర్జా 10వ తరగతి వరకు జసోవర్ గ్రామంలోనే పండిట్ చింతామణి దూబే కాలేజీలో ఇంటర్మీడియట్ చదివింది. ఆ తర్వాత నగరంలోని గురునానక్ బాలికల ఇంటర్ కాలేజీకి వెళ్లింది. ఆమె 12వ తరగతిలో జిల్లా టాపర్‌గా నిలిచింది. హిందీ మీడియం విద్యార్థులు కూడా దృఢ సంకల్పంతో విజయం సాధిస్తారని సానియా తెలిపింది.


ఫైటర్ పైలట్ అవనీ చతుర్వేది అడుగుజాడల్లో నడవాలనుకుని కష్టపడింది గగన విహారమే కాక యుద్ధాలు కూడా చేయగలమని చూపించేందుకు ముందుకు వచ్చింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2022 పరీక్షలో పురుషులు, మహిళలకు కలిపి మొత్తం 400 సీట్లు కేటాయించారు. ఇందులో మహిళలకు 19 సీట్లు.  ఫైటర్ పైలట్‌లకు రెండు సీట్లు మాత్రమే రిజర్వ్ అయ్యాయి. తొలి ప్రయత్నంలో సీటు సాధించలేకపోయానని సానియా ఆగిపోలేదు. రెండో ప్రయత్నంలో చోటు దక్కించుకున్నారు. 






ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎన్డీఏ ఎగ్జామ్ లో 149వ ర్యాంక్తో సానియా మీర్జా పాసైంది. అలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్‌ కానున్న సానియా మీర్జా.. దేశంలోనే తొలి ముస్లిం ఫైటర్ పైలట్గా చరిత్రకెక్కనుంది. డిసెంబరు 27న ఆమె పూణేలోని ఎన్డీయే-ఖడక్వాస్లాలో జాయిన్ అవుతారు. పూణే అకాడమీలో చేరనున్న సానియామీర్జాను చూసి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు గర్వపడుతున్నారు. దేశంలోని ప్రతి అమ్మాయికి స్పూర్తినిచ్చిందని సంతోషం వ్యక్తంచేశారు.