Guidelines For International Arrivals: ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు మళ్లీ మొదలయ్యాయి. ప్రతిరోజూ వందల మంది మరణిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారతదేశంలో కూడా ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనాపై ప్రధాని మోదీ స్వయంగా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. ఇది కాకుండా కేంద్ర ఆరోగ్య మంత్రి అధికారులు, నిపుణుల సహకారంతో సన్నాహాలను నిరంతరం సమీక్షిస్తున్నారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నందున విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు భారత ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో వ్యాక్సినేషన్ నుంచి టెస్టింగ్ వరకు సూచనలు చేసింది. విదేశీ ప్రయాణికుల కోసం జారీ చేసిన మార్గదర్శకాల్లో ఏముందో తెలుసుకుందాం.




    • భారత్‌ వస్తున్న వాళ్లు లేదా రావడానికి సిద్ధంగా ఉన్న వాళ్లు టీకాలు వేయించుకోవాలని సూచించారు. ప్రయాణికులు తమ దేశంలో టీకా ప్రక్రియలో భాగం కావాలని కోరారు.






  • మీరు ప్రయాణిస్తుంటే, మీరు సామాజిక దూరం పాటిస్తూనే మాస్క్‌లను ఉపయోగించాలి. దీని కోసం అన్ని విమానయాన సంస్థలకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రయాణం, అన్ని ప్రవేశ పాయింట్ల వద్ద ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. 

  • ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే నిబంధనల ప్రకారం ఐసోలేషన్లో ఉంచుతామన్నారు. ఈ ప్రయాణీకుడు మాస్క్ ధరించాలి, మిగిలిన ప్రయాణీకుల నుంచి దూరంగా ఉండాలి.

  • డీ బోర్డింగ్ సమయంలో భౌతిక దూరం పాటించాలి. విమానాశ్రయంలో దిగిన తర్వాత ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. ప్రవేశ పాయింట్ల వద్ద హెల్త్ వర్కర్స్‌ను నియమించాలి.

  • స్క్రీనింగ్ సమయంలో ప్రయాణికుల్లో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని ఐసోలేట్ చేసి సమీపంలోని వైద్య కేంద్రానికి తీసుకెళ్లాలి. ఆరోగ్య ప్రోటోకాల్ అనుసరించి తదుపరి చర్యలు తీసుకోవాలి.

  • విమానంలోని మొత్తం ప్రయాణీకుల సంఖ్యలో రెండు శాతం ర్యాండమ్‌గా పరీక్షించాలి. విమానాశ్రయంలో పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు చేయాలి. సమస్య ఉన్న ప్రయాణీకుల గుర్తించి విమానయాన సంస్థలు సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. శాంపిల్ తీసుకున్న తరువాత, ప్రయాణీకులను వెళ్ళడానికి అనుమతిస్తారు.

  • ఒకవేళ పరీక్షించిన తర్వాత ప్రయాణికుల నమూనాల్లో పాజిటివ్ అని తేలితే వీలైనంత త్వరగా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఇన్సాకాగ్ ల్యాబ్‌కు పంపాలి.


ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలలో ప్రయాణీకులు తమ స్వంత ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే, మీరు సమీపంలోని హెల్ప్ డెస్క్ లేదా హెల్ప్ లైన్ నంబర్ (1075) కు కాల్ చేయవచ్చు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను విమానాశ్రయంలో పరీక్షించరాదని ఈ మార్గదర్శకాలలో చెప్పారు. కరోనా లక్షణాలు కనిపిస్తే, ప్రోటోకాల్ ప్రకారం పిల్లలను కూడా పరీక్షించవచ్చు.